ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పండగపూట విషాదం.. వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

ABN, Publish Date - Jan 16 , 2025 | 06:44 AM

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం, మంగెనపూడికి చెందిన మలిశెట్టి దేవహర్ష(26) గచ్చిబౌలిలోగల కేక టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని లక్ష్మీగణేష్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.

పండగపూట విషాదం నెలకొంది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. బైక్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, మనవరాలిని ఆస్పత్రి వద్ద దించడానికి వెళ్తూ ద్విచక్రవాహనంపై నుంచి పడి ఓ వ్యక్తి, కారు ఢీకొని ఒకరు, వాహనం ఢీకొని యువకుడు, మద్యం మత్తులో బైక్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి మరో వ్యక్తి దుర్మరణం చెందారు.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం, మంగెనపూడికి చెందిన మలిశెట్టి దేవహర్ష(26) గచ్చిబౌలిలోగల కేక టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని లక్ష్మీగణేష్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఐడీపీఎల్‌ చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్‌ చౌరస్తాకు వెళ్తున్నారు.


చింతల్‌ రిడ్జి టవర్స్‌ మూల మలుపు వద్ద మరో ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దేవహర్ష తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందాడని సీఐ గడ్డం మల్లేష్‌(CI Gaddam Mallesh) పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బైక్‌ అదుపుతప్పి..

జీడిమెట్ల: మనుమరాలిని ఆసుపత్రి వద్ద డ్యూటీకి వదలటానికి వెళ్తున్న ఓవ్యక్తి బైక్‌పైనుంచి జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. ఆస్బెస్టాస్‌ కాలనీకి చెందిన పి.నారాయణస్వామి (59) సెక్యురిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో తన మనుమరాలు యలమర్తి ప్రసన్న రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. ప్రతి రోజూ మనుమరాలిని తన టీవీఎ్‌సపై ఆస్పత్రి వద్ద దింపివస్తుంటాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకె ళ్తుండగా దీనబంధుకాలనీల వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం కిందపడింది. దీంతో నారాయణస్వామి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నారాయణస్వామి బుధవారం మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


కారు ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి..

చాదర్‌ఘాట్‌: వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చాదర్‌ఘాట్‌ ఎస్‌ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం, ధన్‌వాడ గ్రామానికి చెంది. జి. శిశుడు(40)కు మతిస్థిమితం లేదు. మలక్‌పేట అఫ్జల్‌నగర్‌ ప్రాంతంలో ఫుట్‌ఫాత్‌పై ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


వాహనం ఢీకొని యువకుడు..

హయత్‌నగర్‌: బంజారా కాలనీకి చెందిన సభావత్‌ రాంకుమార్‌(21) మంగళవారం రాత్రి ఇంటి నుంచి బైక్‌పై ఇంజాపూర్‌ వైపు వెళ్తున్నాడు. జైస్వాల్‌ ఫర్నిచర్‌ షోరూమ్‌ వద్ద అతడిని వెనుక నుంచి వస్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాంకుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 06:44 AM