Hyderabad: హెడ్ కానిస్టేబుల్‌నని నమ్మించి ఏం చేశాడో తెలిస్తే..
ABN , Publish Date - Feb 20 , 2025 | 11:09 AM
తాను హెడ్ కానిస్టేబుల్(Head Constable)నని నమ్మించి డబ్బులు వసూలు చేసిన కేసులో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన హరిజన గోవర్దన్ (35) కూకట్‌పల్లిలో ఉంటున్నాడు.

హైదరాబాద్ సిటీ: తాను హెడ్ కానిస్టేబుల్(Head Constable)నని నమ్మించి డబ్బులు వసూలు చేసిన కేసులో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన హరిజన గోవర్దన్ (35) కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. 2009-14 వరకు అగ్నిమాపక శాఖలో హోంగార్డుగా పనిచేశాడు. అక్కడ విధులు మానేసిన తర్వాత పాల పంపిణీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: పలు రైళ్లు రద్దు.. భాగ్యనగర్, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు సహా మరో రెండు..
ఈ క్రమంలో గోవర్దన్ ఓ రోజు బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనం ఎదురుగా ఉన్న కేఫ్‌లో ఉండగా.. ఆరేటి జ్ఞానసాయి ప్రసాద్ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అతనితో మాట కలిపిన గోవర్దన్ తాను ఎదురుగా ఉన్న ఐసీసీసీ భవన్‌లో టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని నమ్మించారు. తర్వాత ఓ రోజు ఐసీసీసీ భవనం వద్దకు జ్ఞానసాయి పిలిపించగా హోటల్ వ్యాపారానికి సహకరించేందుకు రూ.2,82,725లను ఇచ్చాడు.
ఈ తర్వాత నుంచి గోవర్దన్(Govardhan) ఎలాంటి స్పందన లేదు. దీంతో తొలిసారి కలిసిన ప్రాంతం వద్దకు చేరుకుని అతను చెప్పిన ఆఫీస్‌లో విచారించగా, అలాంటి వ్యక్తి ఇక్కడ పనిచేయడం లేదని చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించి బంజారాహిల్స్(Banjara Hills) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 17వ తేదీన అరెస్టు నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News