ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:05 PM

గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మియాపూర్‌ పోలీసులు(Miyapur Police) అరెస్టు చేశారు. 6.5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

మియాపూర్‌(హైదరాబాద్): గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మియాపూర్‌ పోలీసులు(Miyapur Police) అరెస్టు చేశారు. 6.5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ 603 దగ్గర మంగళవారం రాత్రి మాదాపూర్‌ ఎస్‌ఓటీ, మియాపూర్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాగర్‌ కర్నూలు(Nagar Kurnool) జిల్లా ఇంద్రకల్‌ గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌(27)ను అనుమానించి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి దొరికింది.

ఈ వార్తను కూడా చదవండి: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్న వారే టార్గెట్‌


అతన్ని విచారించగా అరకులో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌(Fast food center) నడుపుతున్నానని తెలిపాడు. అరకు నుంచి సంక్రాంతి పండుగకు సొంతూరుకు వస్తున్నాడు. దీంతో అక్కడి నుంచిగంజాయి తీసుకొచ్చి స్థానికంగా విక్రయించాలనుకున్నాడు. గతంలో అల్వాల్‌ పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసులో పట్టుబడి ఏడాది జైలుకెళ్లి వచ్చాడు. 6.5కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 12:05 PM