Bengaluru: తల్లితో కలసి తోటకెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:39 PM
తల్లితో కలిసి తోటకెళ్లిన వారికి అదే చివరి రోజైన విషాద సంఘటన ఇది. వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న వారు తల్లితో కలిసి తమ పొలం వద్దకు వెళ్లారు. అయితే.. అక్కడే ఉన్న వ్యవసాయ కుంటలో ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయారు. దీంతో గ్రామంతో తీవ్ర విషాదం నెలకొంది.

- వ్యవసాయ కుంటలో పడి అక్కాచెల్లెళ్ల మృతి
బాగేపల్లి(బెంగళూరు): నియోజకవర్గంలోని చేళూరు(Cheluru) తాలూకా సోమనాథపుర(Somanathapuram) గ్రామ పంచాయతీ కురపల్లిలోని వ్యవసాయకుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. రాధ(17), సాహితి (14) మృతులుగా గుర్తించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తల్లితో కలసి తోటకెళ్లారు. తోటకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ కుంట పైప్‌ను బాగు చేసే ప్రయత్నంలో అక్కచెల్లెళ్లు ఇద్దరు కాలు జారిపడ్డారు. కొద్దిసేపటికే ఊపిరాడక మృతిచెందారు. పిల్లలను కోల్పోయిన తల్లి ఆవేదన అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న చేళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: డీకే మార్పు అనివార్యమైతే.. కొత్త సారధి ఈయనేనట..
ఈ వార్తలు కూడా చదవండి:
సైఫ్ అలీఖాన్‍పై దాడి కేసులో కీలక పరిణామం
ఈయన మూమూలోడు కాదు.. లక్కీభాస్కర్ స్టైల్లో 10 కోట్లు కొట్టేశాడు..