Share News

Hyderabad: జైల్లో రిమాండ్‌ ఖైదీతో రీల్స్‌ ..

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:00 AM

చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ ములాఖత్‌ సమయంలో సోషల్‌ మీడియాలో లైవ్‌ రీల్స్‌ చేయడం సంచలనంగా మారింది. అసలు జైలులోకి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లరాదన్న నిబంధన ఉంది. అయితే.. ఏకంగా సెల్‏ఫోన్లను తీసుకెళుతూ లైవ్‌ రీల్స్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Hyderabad: జైల్లో రిమాండ్‌ ఖైదీతో రీల్స్‌ ..

- ములాఖత్‌కు వచ్చి.. వీడియో తీసిన వ్యక్తి

- సోషల్‌ మీడియాలో వైరల్‌.. అధికారులు సీరియస్‌

- ఇద్దరు జైలు సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు(Chanchalguda Central Jail)లో డొల్లతనం మరోమారు బయటపడింది. కొన్నాళ్ల క్రితం ఓ ఖైదీ నకిలీ బెయిల్‌ పత్రాలతో విడుదలవ్వగా.. తాజాగా మరో రిమాండ్‌ ఖైదీ ములాఖత్‌ సమయంలో సోషల్‌ మీడియా(Social media)లో లైవ్‌ రీల్స్‌ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన జైలు భద్రతతోపాటు.. పోలీసు వ్యవస్థకు సవాలుగా మారింది. ములాఖత్‌కు వచ్చిన వారు ఖైదీలకు గంజాయి, సిగరెట్లు, బీడీలు, ఇతర నిషేధిత పదార్థాలను దొంగచాటుగా అందించిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చినా.. సెల్‌ఫోన్‌తో రీల్స్‌ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం..

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: కుషాయిగూడలో వృద్ధురాలి హత్య


జైళ్లశాఖ వర్గాల కథనం ప్రకారం.. పహాడీషరీఫ్‌(Pahad Sharif)లోని షాహిన్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అహ్మద్‌-బిన్‌-హసన్‌ అలీ జాబ్రీని ఓ బెదిరింపు కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి, చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు.. శుక్రవారం జాబ్రీని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్‌కు తరలించారు. శనివారం జాబ్రీని ములాఖత్‌లో కలిసేందుకు అతని స్నేహితులు వచ్చారు. జైలు నిబంధనల ప్రకారం.. ములాఖత్‌ గదిలో సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడం నిషేధం.


ములాఖత్‌లో గాజుగోడకు ఆవల ఖైదీలు.. ఇటువైపు వారి బంధుమిత్రులు ఇంటర్‌కామ్‌ ఫోన్‌తో మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. అయితే.. జాబ్రీ స్నేహితులు దొంగచాటుగా తీసుకొచ్చిన సెల్‌ఫోన్‌తో అతని వీడియోను తీశారు. దాన్ని జాబ్రీ సోషల్‌మీడియా ఖాతా(10 లక్షల మంది ఫాలోయర్లు)లో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్‌ అవ్వడంతో.. సోమవారం జైళ్లశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


విషయం తెలుసుకున్న జాబ్రీ స్నేహితులు సోషల్‌ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించారు. పోలీసులు ములాఖత్‌ రిజిస్టర్‌ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ములాఖత్‌ హాలు వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. కాగా.. 24 ఏళ్ల వయసున్న జాబ్రీ.. చూడ్డానికి 17 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. ఇతనిపై బెదిరింపులు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పలు కేసులున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2025 | 10:00 AM