Share News

Hyderabad: మామూళ్లు ఇవ్వాలని వేధించినందుకే రౌడీషీటర్‌ హత్య

ABN , Publish Date - Apr 16 , 2025 | 10:48 AM

నగరంలోని పాతబస్తీలో గత మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో మిస్టరీ వీడింది. మామూళ్లు ఇవ్వాలని పదేపదే వేధిస్తుండడంతో అతడిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పాతబస్తీకి చెందిన మసీయుద్దీన్‌ అలియాస్ మసి గత మూడు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Hyderabad: మామూళ్లు ఇవ్వాలని వేధించినందుకే రౌడీషీటర్‌ హత్య

- మసీయుద్దీన్‌ హత్య కేసులో 8 మంది అరెస్ట్‌

హైదరాబాద్: రౌడీషీటర్‌ మసీయుద్దీన్‌(Masiyuddin) హత్య కేసును సౌత్‌జోన్‌ పోలీసులు ఛేదించారు. మామూలు ఇవ్వాలని వేధించినందుకే అతడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఐదు కత్తులు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌ చౌక్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, రెయిన్‌ బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ నాయక్‌, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ దన్‌లాల్‌తో కలిసి దక్షిణ మండలం ఇన్‌చార్జి డీసీపీ శ్వేత మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఇంజెక్షన్‌ వల్లే చనిపోయాడు..


డబీర్‌పురా దర్వాజ వద్ద పుచ్చకాయలు విక్రయిస్తున్న ఒమర్‌ ఖాన్‌ వద్దకు వెళ్లిన మసీయుద్దీన్‌.. ‘నేను రౌడీ షీటర్‌ను. ఇక్కడ వ్యాపారం చేయాలంటే నాకు 20 వేలు మాములు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రంజాన్‌ తర్వాత అంతుచూస్తానంటూ ఓమర్‌ఖాన్‌ను మసీయుద్దీన్‌ బెదిరించాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిరింది. అయినప్పటికీ మసీయుద్దీన్‌ హెచ్చరికలతో ఒమర్‌ఖాన్‌కు భయం పట్టుకుంది.


city5.2.jpg

తనను హత్య చేస్తాడని భావించిన ఒమర్‌ ఖాన్‌ ఈ విషయం బంధువులు, స్నేహితులైన మహ్మద్‌ పాషా జిలానీ అలియాస్‌ షేర్‌, ఆరిఫ్‌ ఖాన్‌, గౌసుద్దీన్‌ అలియాస్‌ సజ్జి, టాబ్రెజ్‌ అలియాస్‌ తబ్బు, సయ్యద్‌ ఇబ్రహీమ్‌, సయ్యద్‌ బషీర్‌ అలియాస్‌ బషీర్‌ ఖాన్‌, అబు బకర్‌ అలియాస్‌ అబ్బులకు చెప్పాడు. మసీయుద్దీన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజులుగా అదును కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెల 13వ తేదీ రాత్రి 11 గంటలకు అందరూ డబీర్‌పురా ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకొని మసీయుద్దీన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.


పెళ్లి పత్రికలు పంచి రాత్రి ఒంటిగంట సమయంలో డీలక్స్‌ మెడికల్‌ హాల్‌ వద్దకు మసీయుద్దీన్‌ వచ్చాడని సమాచారం అందుకున్న నిందితులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి హత్యచేసి పారిపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సంతోష్‏నగర్‌ యాదగిరి టాకీస్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. మసీయుద్దీన్‌పై కూడా 19 కేసులు ఉన్నాయని, పీడీ యాక్డ్‌ ఉందని డీసీపీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 10:50 AM