ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Jan 01 , 2025 | 09:19 AM

ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావీద్‌ తెలిపారు.

సికింద్రాబాద్‌: ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావీద్‌ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జావీద్‌, రైల్వే పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలను వెల్లడించారు. ఒడిశా(Odisha)లోని గాజపాటి జిల్లా ఘాసాపాడ గ్రామానికి చెందిన సర్భన్‌ నాయక్‌ (29) ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తాడు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: నాయకుల వెన్నుపోటుతోనే బీజేపీ ఓటమి..


అదే గ్రామానికి చెందిన తఫాన్‌ బిషోయో (27)తో పాటు మానస్‌ ఒడిశాలో రూ.1.22 లక్షల విలువ చేసే 4.9 కిలోల గంజాయి కోనుగోలు చేశారు. అక్కడినుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Konark Express train)లో సరఫరా చేస్తుండగా మంళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెర్తు కింద ఉన్న లగేజీలను పరిశీలించగా అందులో గంజాయి సరుకు ఉందని తెలుసుకున్న పోలీసులు ముందుగా సర్భన్‌ నాయక్‌, తఫాన్‌ బిషోయోలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన మానస్‌ అక్కడి నుంచి పారిపోయాడు. గంజారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 09:38 AM