Hyderabad: సులభంగా డబ్బు సంపాదించాలని.. నకిలీ యూఎస్ డాలర్లు, నోట్ల ప్రింటింగ్
ABN, Publish Date - Jan 25 , 2025 | 10:16 AM
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నకిలీ నోట్లు తయారు చేసి సరఫరా చేస్తున్న నిందితుడిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ(LB Nagar SOT), పహాడిషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

- నిందితుడి అరెస్ట్
- రూ. 5 లక్షల విలువగల 500 ఫేక్ నోట్లు, ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నకిలీ నోట్లు తయారు చేసి సరఫరా చేస్తున్న నిందితుడిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ(LB Nagar SOT), పహాడిషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయం(Rachakonda Commissioner's Office)లో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) వివరాలు వెల్లడించారు. వనపర్తి(Wanaparthy) జిల్లా, ఆత్మకూర్ మండలం, అమరచింత గ్రామానికి చెందిన కర్లి నవీన్‌కుమార్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా పూర్తి చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Huma Qureshi: హీరోలు మాత్రం ఆ పాత్రలకు ఒప్పుకోరు..
ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్లు తయారు చేయాలని పథకం వేశాడు. నోట్ల తయారీకి పనికి వచ్చే 45 జీఎస్ఎం పేపర్ కోసం ఇండియా మార్ట్‌లో వెతుకుతుండగా కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరిచయం అయ్యాడు. నకిలీ నోట్ల తయారీకి సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చాడు. నోట్ల తయారీ కోసం ప్రింటర్, కలర్స్ కొనుగోలు కోసం కర్నూల్‌లో ఉన్న స్నేహితుడిని నవీన్ సంప్రదించగా అతడు డబ్బు ఇవ్వడంతో ఎపిసన్ ప్రింటర్, కలర్స్ కొన్నాడు.
ఈ ప్రింటర్ సాయంతో తీసిన రూ. 500నోట్లు సరిగా రాకపోవడంతో కోల్‌కతా వ్యాపారి నోట్లలో ఉండే కరెన్సీ త్రెడ్‌ను పోలిన పేపర్‌ను నవీన్‌కు పంపాడు. ఆ పేపర్‌తో సెక్యూరిటీ త్రెడ్ తయారు చేశాడు. త్రెడ్‌ను పేపర్లలో పెట్టి కొరియర్ ద్వారా కోల్‌కతా, విజయవాడ, గుజరాత్(Kolkata, Vijayawada, Gujarat) పంపించాడు. యూఎస్ డాలర్ వాటర్‌మార్క్ షీట్లను కూడా తయారు చేసి వేర్వేరు ప్రాంతాలకు కొరియర్ చేశాడు.
నోట్‌లకు సంబంధించిన త్రెడ్‌లు సరఫరా చేస్తున్న తరుణంలో కోల్‌కతా వ్యాపారి గుజరాత్‌కు చెందిన వ్యక్తిని పరిచయం చేశాడు. గుజరాత్ వ్యక్తి నవీన్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. నవీన్‌కు కరెన్సీ ప్రింట్ చేసేందుకు ఖరీదైన ప్రింటర్‌ను ఇప్పించాడు. నవీన్‌కు పేపర్ షీట్‌కు రూ.50 చొప్పున 25 లక్షల షీట్ ప్రింట్ చేసి ఇచ్చే ఆర్డర్ కూడా వచ్చింది.
గుజరాత్‌కు చెందిన వ్యక్తి ఆర్డర్ మేరకు రూ.500 నకిలీ నోట్లు రూ.5 లక్షల విలువగలవి ప్రింట్ చేశాడు. ఈ నోట్లను డెలివరీ ఇచ్చేందుకు తుక్కుగూడ జంక్షన్‌లో వేచి చూస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ, పహాడిషరీఫ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడు నవీన్ నుంచి నకిలీ రూ.500 నోట్లు, రంగులు, ప్రింటర్, 45 జీఎ్‌సఎం పేపర్, కలర్స్, గాంధీ బొమ్మ వేసిన స్ర్కీన్ ప్రింటింగ్ ఫ్రేములు, సెక్యూరిటీ దారం ఉన్న పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 25 , 2025 | 10:16 AM