Share News

Hyderabad: ఇంట్లో అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 08:52 AM

ఏం జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో తెలియదు.. ఇంట్లో అక్కాచెల్లెళ్లు మృతిచెంది ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని అక్కాచెల్లెళ్లు మీనా చంద్రన్‌, వీణాచంద్రన్‌ మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గర్తించారు.

Hyderabad: ఇంట్లో అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..

- మృతిపై పలు అనుమానాలు

హైదరాబాద్: మానసికస్థితి సక్రమంగా లేని అక్కాచెల్లెళ్లు ఇంట్లో చనిపోయి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌ఐ నరేష్‌(SI Naresh) తెలిపిన వివరాల ప్రకారం కార్ఖానా పీఎస్‌ పరిధిలోని మనోవికాస్‏నగర్‌(Manovikasnagar) శ్రీనిధి అపార్ట్‌మెంట్‌ బీ-బ్లాక్‌ 4వ అంతస్తులో అక్కాచెల్లెళ్లు మీనా చంద్రన్‌ (59), వీణాచంద్రన్‌ (60) కొన్నేళ్ల నుంచి ఉంటున్నారు. వారు అవివాహితులు. అనారోగ్య సమస్యలతో పాటు మానసిక స్థితి సరిగా లేదు. ఇద్దరూ అప్పుడప్పుడూ స్థానికులతో వింతగా ప్రవరిస్తుండేవారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మాయిలను అడ్డుపెట్టుకుని కాసుల వేట


పక్క ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసే అలవాటు ఉండేది. దాంతో అపార్ట్‌మెంట్‌(Apartment)వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొన్ని రోజులుగా వీరిద్దరూ బయటకు రాలేదు. ఆదివారం గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఎదురింటి వాళ్లు అదేరోజు కార్ఖానా పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న వారి మరో సోదరి సాధనకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచారు. ఇంట్లో సామాను చెల్లాచెదురుగా పడి ఉంది.


ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. క్లూస్‌ టీమ్‌ని రంగంలోకి దింపిన పోలీసులు పలు ఆధారాలను సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్‌ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. అతడు మృతి చెందడంతో తండ్రి ఫించన్‌ డబ్బులతో జీవనం గడుపుతున్నట్లు సోదరి తెలిపింది. సీఐ రామకృష్ణ కేసు దర్యా ప్తు చేస్తున్నారు. వారి మృతికి గల కారణాల ను ఆరా తీస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 08:52 AM