Share News

Hyderabad: అమ్మాయిలను అడ్డుపెట్టుకుని కాసుల వేట

ABN , Publish Date - Apr 16 , 2025 | 08:23 AM

నగరంలోని పబ్‏లు గబ్బు రేపుతున్నాయి. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న పబ్‌ యజమానిపై పోలీసులు కేసులు నమోదు యేస్తున్నా.. మళ్లీ అదే అశ్లీల పందాను అవలంభిస్తున్నారు. తాజాగా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోగత ఓ పబ్‏లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు విషయం వెలుగులోకి వచ్చింది.

Hyderabad: అమ్మాయిలను అడ్డుపెట్టుకుని కాసుల వేట

- వారితో అశ్లీల నృత్యాలు

- కస్టమర్లకు రూ.వేలల్లో బిల్లులు

- వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌పై పోలీసుల దాడి

-16 మంది యువతుల అరెస్ట్‌

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar) ప్రాంతం చైతన్యపురి పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో వైల్డ్‌ హార్ట్స్‌ అనే పబ్‌ ఉంది. ఈ పబ్‌ యజమాని రాము.. యువతను ఆకర్షించేందుకు ‘ఫ్రీ ఎంట్రీ’ ఆప్షన్‌ పెట్టాడు. వచ్చిన యువకుల వద్దకు అమ్మాయిలను పంపి అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తూ ఆ మైకంలో మద్యం తాగేలా ఉసిగొలుపుతున్నాడు. ఒక్కొక్కరితో అధికంగా బిల్లులు చేయిస్తున్నాడు. అలా ఒక్కో కస్టమర్‌ నుంచి రూ. వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..


city2.jpg

నిబంధనలకు విరుద్ధంగా వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు(LB Nagar SOT Police) దాడి చేశారు. అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులు, డీజే ఆపరేటర్‌ను అరెస్టు చేసి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పబ్‌ యజమాని రాము, మేనేజర్‌ సంతోష్‌ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. కొందరు యువతులను ముంబయి నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 08:23 AM