Share News

Hyderabad: ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:19 AM

ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే యువతి నిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. అయితే.. ఆమె జానారెడ్ది అనే యువకుడు గత కిందకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. జానారెడ్డికి వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఇది తెలిసిన మల్లీశ్వరి మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది

Hyderabad: ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..

- మత్తు ఇంజెక్షన్‌ తీసుకొని యువతి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్తాపానికి గురైన యువతి మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లోని ప్రైవేట్‌ హాస్టల్లో ఉంటూ నిమ్స్‌లో స్టాఫ్‌ నర్స్‌(Staff Nurse)గా పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన జానారెడ్ది, మల్లీశ్వరి(Janareddy, Malleswari) ప్రేమించుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: భూ భారతి పైనే రైతుల ఆశలు


ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేదు. ఇద్దరూ కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు. జానారెడ్డి నెలరోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన మల్లీశ్వరి మనస్తాపానికి గురైంది. ఈనెల 13న హాస్టల్‌కు వచ్చిన అనంతరం మల్లీశ్వరి బాత్రూమ్‌లోకి వెళ్లి అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు జానారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 07:30 AM