Today Horoscope: ఈ రాశిలో పుట్టారా ధనం వద్దన్నా మిమల్ని వెతుక్కుంటూ వస్తుంది
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:17 AM
నేడు 02-04-2025, బుధవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం

నేడు 02-04-2025, బుధవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగతాయి. సంకల్పం నెరవేరుతుంది
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి లాభాలు గడిస్తారు.
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు సంతృప్తిని ఇస్తాయి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. రాజకీయ, సిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపానీయాల్లో నియామాలు పాటించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, ట్రేడింగ్‌లలో మంచి ఫలితాలు సాధిస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కేటరింగ్, సేవలు, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ అనందం కలిగిస్తాయి. ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రకటనలు, చిట్‌ఫండ్‌లు, విద్యాసంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాతకోతలు, ప్రయాణాలకు అనుకూలం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు. వే డుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు.

ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు

ఈ రాశి వారికి అదృష్టం అంచెలంచెలుగా విస్తరిస్తుంది

ఈ రాశి వారు కొత్త భవిష్యత్తు కోసం ఉత్సాహంగా అడుగులు వేస్తారు

ఈ రాశి వారు కోల్పోయినది రెట్టింపు లాభంగా తిరిగొస్తుంది

ఈ రాశి వారికి కష్టాలు మాయమై కొత్త జీవితం ప్రారంభమవుతుంది
