Today Horoscope: ఈ రాశి వారు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:05 AM
నేడు 06-04-2025, ఆదివారం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి

నేడు 06-04-2025, ఆదివారం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, విరాళాలకు ఖర్చు చేస్తారు. కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం ఫలిస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పది మందిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణమాలు జరుగుతాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమాలు, రాజకీయాలు, ఉన్నత విద్య, కన్సల్టెన్సీ, ఆడిటింగ్ రంగాల వారికి సంకల్పం ఫలిస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విరాళాలు ఇస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెంపొందించుకునేందుకు వ్యూహాలు రచిస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రచురణలు, ఆడిటింగ్, రవాణా, కళా రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆధ్మాతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతమలు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. వేడుకల కోసం ఖర్చు చేస్తారు. పన్నులు, పెట్టుబడుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. సంకల్పం నెరవేరుతుంది.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతములతో షాపింగ్ ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాలు కోసం ఖర్చు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది.