ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Negative Energy: బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్తే.. ఇవి అస్సలు తీసుకురావొద్దు..

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:12 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావం చూపుతాయి. యజమాని మారితే వస్తువు శక్తి కూడా మారుతుంది. అందుకే ఎవరి ఇంటి నుంచైనా ప్రతికూల శక్తి ప్రభావాన్ని చూపే వస్తువులను తీసుకువెళ్లొద్దని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరి జీవితాల్లో స్నేహితులు, బంధువులు ఎంతో ముఖ్యం. తరచూ వారిని కలుస్తూ బాధలు, సంతోషాలు అన్నీ పంచుకుంటుంటారు. అప్పుడప్పుడు వారి ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పలకరిస్తుంటారు. అంత వరకూ పర్లేదు కానీ.. వారి ఇంటి నుంచి ఎలాంటి వస్తువులనూ తీసుకువెళ్లొద్దని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా ఇతరుల ఇళ్ల నుంచి కొన్ని రకాల వస్తువులు తీసుకువెళ్తే జీవితాలపై ప్రతికూల ప్రభావాలు పడుతాయని చెబుతున్నారు. పేదరికం ఆవహించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఆ వస్తువులు ఏంటి, ఎందుకు తీసుకెళ్లకూడదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావం చూపుతాయి. యజమాని మారితే వస్తువు శక్తి కూడా మారుతుంది. అందుకే ఎవరి ఇంటి నుంచైనా ప్రతికూల శక్తి ప్రభావాన్ని చూపే వస్తువులను తీసుకువెళ్లొద్దని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వస్తువుల్లో ముందుగా చెప్పులు, గొడుగు, ఫర్నిచర్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు.


ఫర్నిచర్..

చాలా మంది తమ ఇళ్లల్లో ఫర్నిచర్ వాడుతుంటారు. కొంచెం పాడవగానే కొత్తవి కొనేందుకు ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే తెలిసిన వాళ్లకి లేదా చుట్టాలు, స్నేహితులకు పాడైన ఫర్నిచర్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫర్నిచర్ తీసుకోవద్దు. ఎందుకంటే దాంతోపాటు ప్రతికూల శక్తి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించి వాస్తు దోషాలను కలిగించే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోకి ఇతరుల పాత సామాను తీసుకురావడం ద్వారా పేదరికాన్ని ఆహ్వానించినట్లేనని అంటున్నారు. అలాంటి చర్య ఓ సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


చెప్పులు..

ఇతరుల చెప్పులు ధరించవద్దని మన పెద్దలు అప్పుడప్పుడు చెప్తుంటారు. అలా చేస్తే వారి దరిద్రం మనకి అంటుతుందని హెచ్చరిస్తుంటారు. అయితే ఈ విషయం నిజమేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనం ఎవరి ఇంటికైనా వెళ్తే పొరపాటున కూడా వారి చెప్పులు లేదా బూట్లు ధరించవద్దని సూచిస్తున్నారు. శరీరం నుంచి ప్రతికూల శక్తి మొదటగా బయటకు వెళ్లే ప్రదేశం పాదాలేనని, ఒకవేళ ఇతరుల బూట్లు, చెప్పులు ధరిస్తే వారి ప్రతికూల ప్రభావం మీలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల కుటుంబం మెుత్తం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.


గొడుగు..

చెప్పులు, పాత సామాన్లతోపాటు గొడుగు కూడా ఇతరుల నుంచి తీసుకోవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు వర్షం లేదా ఎండలు బాగా ఎక్కువగా ఉన్న సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు వారిచ్చిన గొడుగు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే దాన్ని మీ ఇంటి లోపలికి తీసుకురావొద్దు. అలాగే ఆ గొడుగును తిరిగి వారికి అస్సలు ఇవ్వొదని వాస్తు పండితులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Holi Festival: హోలీకి ముందు కామ దహనం ఎందుకు చేస్తారు.. దీని వెనుక అంత కథ ఉందా..!

Today Horoscope : ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు

Updated Date - Mar 14 , 2025 | 05:13 PM