SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:08 AM
హైదరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) నుంచి 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలోని ప్రతిష్టాత్మకమైన పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో కీలక పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, అకాడమీ మొత్తం 91 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), ఇన్‌స్పెక్టర్ సహా ఇతర ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, పదో తరగతి (10వ తరగతి), మాస్టర్స్ డిగ్రీ లేదా MCA పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 2025 మార్చి 5 నుంచి 2025 జూన్ 30 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ పేరు: SVPNPA SI, ఇన్స్పెక్టర్, ఇతర పోస్టులు
పోస్ట్ తేదీ: 03-04-2025
చివరి తేదీ: 30-06-2025
మొత్తం ఖాళీలు: 91
దరఖాస్తు రుసుము పేర్కొనబడలేదు
SVPNPA రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీల వివరాలు
ఇన్‌స్పెక్టర్ (డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్) 04
ఇన్‌స్పెక్టర్ (బ్యాండ్) 01
ఇన్‌స్పెక్టర్ (మెస్) 01
ఇన్‌స్పెక్టర్ (MT) 01
ఇన్‌స్పెక్టర్ (సైబర్ క్రైమ్) 01
సబ్ ఇన్‌స్పెక్టర్ (మినిస్టీరియల్) 02
సబ్ ఇన్‌స్పెక్టర్ (రైడింగ్) 03
సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్) 01
సబ్ ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్) 01
సబ్ ఇన్‌స్పెక్టర్ (అవుట్‌డోర్) 03
ASI (మినిస్టీరియల్) 06
రేడియో టెక్నీషియన్ 01
వైర్‌లెస్ ఆపరేటర్ 04
హెడ్ కానిస్టేబుల్ (పయనీర్) 09
కానిస్టేబుల్ (GD & డ్రైవర్) 26
కానిస్టేబుల్ (బ్యాండ్) 11
కానిస్టేబుల్ (బగ్లర్) 01
కానిస్టేబుల్ (పయనీర్) 15
ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ఖాళీలు భర్తీ చేయబడతాయి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి5, 2025న మొదలు కాగా, జూన్ 30, 2025న ముగుస్తుంది. అభ్యర్థులు డిప్లొమా, 10వ తరగతి, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, MCA (సంబంధిత రంగాల్లో) అర్హత కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను svpnpa.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను నింపి, సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, సూచించబడిన చిరునామాకు పంపించాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఫిజికల్ పరీక్షలు, ఇంటర్వ్యూ వంటి దశలు ఉండవచ్చు. ప్రతి పోస్టుకు సంబంధించిన ఎంపిక విధానాన్ని మారుతుంది. వేతనాలు పోస్టు ఆధారంగా మారుతుంటాయి. సాధారణంగా SVPNPAలోని పోస్టులకు నెలవారీ వేతనాలు రూ.45,879 నుంచి రూ.1,18,645 వరకు ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు, అన్ని అర్హతలు, నియామక పద్ధతుల గురించి తెలుసుకుని అప్లై చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Read More Business News and Latest Telugu News