Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:59 PM
Tips For Salary Hike: కష్టపడి పనిచేస్తున్నా ఎన్నాళ్లకి జీతంలో పెరగడం చింతిస్తున్నారా.. టాలెంట్ ఉన్నా జూనియర్ల కంటే తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నారా..దిగులు పడకండి. ఈ 6 చిట్కాలు వెంటనే అమల్లో పెట్టండి. కచ్చితంగా కెరీర్‌లో వేగంగా దూసుకెళతారు.

Career Growth Tips: టాలెంట్, కష్టపడే తత్వం అన్నీ ఉన్నా జీతం విషయంలో ఏళ్లు గడుస్తున్నా వెనకే ఉండిపోవడం ఏ ఉద్యోగికైనా బాధాకరమైన విషయమే. నానాటికీ పెరుగుతున్న ధరలు, ఆర్థిక అవసరాలకు తోడు పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే అంత తేలిక కాదు. ఎంత శ్రమిస్తున్నా కళ్లెదుటే జూనియర్లు పై స్థానాలకు ఎగబాకుతూ ఉంటే ఒత్తిడి ఇంకా తీవ్రమవుతుంది. వేచి ఉండే ధోరణి, మన ఉనికి అందరికీ తెలిసేలా చేయగలిగే చాకచక్యం, కమ్యునికేషన్ స్కిల్స్, టీం మేనేజ్ చేసే సామర్థ్యం లేకపోవడం, ఇలా ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. కానీ, మీ జీతం పెంపు అవకాశాలను గణనీయంగా పెంచే కొన్ని వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 6 టిప్స్ వెంటనే ఆచరణలో పెడితే తప్పక మీ శాలరీ పెరుగుతుంది.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి
మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం వల్ల మీరు పనిలో మరింత విలువైన వ్యక్తి అవుతారు. మీ ఇష్టాఇష్టాలు, బడ్జెట్, కెరీర్ లక్ష్యాల ఆధారంగా ఆన్‌లైన్ కోర్సులు ద్వారా స్కిల్స్ పెంచుకోండి. ఈ పద్దతి వృత్తిపరంగా ఎదగడానికి, మీ రంగంలో అందరి కంటే ముందంజలో ఉండటానికి సహాయపడుతుంది.
బాస్‌తో మాట్లాడండి
మార్కెట్ ప్రమాణాల ప్రకారం పనికి తగ్గ వేతనం మీకు దక్కడం లేదని విశ్వసిస్తే ఈ విషయం గురించి నేరుగా, ధైర్యంగా, నిజాయితీగా మీ బాస్ తో చర్చించండి. మనసులోని ఆలోచనలను స్పష్టంగా గౌరవభావంతో అర్థమయ్యేలా పంచుకోండి. మీ టాలెంట్ ఏపాటిదో చూపించడానికి మీరు సాధించిన అఛీవ్‌మెంట్స్ గురించి ఉదాహరణలు, డేటాతో సహా తెలియజెప్పేందుకు వెనుకాడకండి.
అభిప్రాయం
క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వల్ల మీ బలాలు, బలహీనతలు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఫీడ్‌బ్యాక్‌పై తీసుకోవడం వల్ల ఏ విషయంలో వెనుకపడ్డారో అర్థమవుతుంది కాబట్టి దిశగా వృద్ధి చెందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. అప్పుడు శాలరీ హైక్ కోసం బాస్ దగ్గర మరింత బలంగా మీ వాదనను చెప్పేందుకు అవకాశం లభిస్తుంది.
చొరవ తీసుకోండి
చేసే పనుల్లో లీడ్ తీసుకునేందుకు సంకోచించకండి. సాధారణ బాధ్యతలకు మించి కష్టించి పనిచేసి టాస్క్ పూర్తిచేయడానికి మీరెలాంటి చొరవ తీసుకుంటారో అందరి ఎదుటా నిరూపించే ప్రయత్నం చేయండి.
విజయాన్ని పంచుకోండి
మీ విజయాల గురించి మాట్లాడటానికి వెనుకాడకండి. పెద్ద సమస్యను పరిష్కరించినా, బృందానికి మద్దతు ఇచ్చినా, లేదా ఒక ప్రాజెక్టు సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించినా.. మీ సహాయసహకారాలు మేనేజర్‌కు కనిపించేలా చూసుకోండి.
మార్కెట్ విలువను తెలుసుకోండి
జీతం పెంచమని అడిగే ముందు మీ రోల్ కు సంబంధించి ప్రస్తుత మార్కెట్లో ఎలాంటి జీతభత్యాలు దక్కుతున్నాయో పరిశోధించండి. మీ స్థానాల్లో ఉన్న నిపుణులు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవడానికి గ్లాస్‌డోర్ లేదా లింక్డ్‌ఇన్ వంటి విశ్వసనీయ వెబ్‌సైట్‌లను ఉపయోగించండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఉద్యోగులు తమ కెరీర్ వృద్ధి చేసుకోవచ్చు.
Read Also: ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు
NCB recruitment 2025: నార్కోటిక్ బ్యూరోలో ఉద్యోగాలు