CTET Results: సీటెట్ రిజల్ట్స్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:26 PM
సీటెట్ డిసెంబర్ పరీక్ష ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ సెషన్ ఫలితాలను CBSE బోర్డు తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు క్రింది పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET డిసెంబర్ ఫలితాలను (CTET December 2024 Results) CBSE తాజాగా అనౌన్స్ చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా తమ ఫలితాలను తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CTET ఫలితాల సమయంలో జారీ చేసిన స్కోర్‌కార్డ్ జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. కాబట్టి విద్యా రంగంలో తమ కెరీర్‌ను రూపొందించుకోవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
CTET ఫలితాల లింక్
CTET డిసెంబర్ ఫలితాలు 2024 కోసం ఇక్కడ ctet.nic.in క్లిక్ చేయండి. సీబీఎస్ఈ డిసెంబర్ 14న దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో సీటీఈటీ పరీక్షను నిర్వహించింది. ప్రతి సంవత్సరం CTET ఫలితాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక నెలలోపు ప్రకటిస్తుంది. CTET పరీక్ష జవాబు కీని CBSE జనవరి 1న ప్రచురించింది. ఆ తర్వాత ఆన్సర్ కీపై అభ్యంతరాలను నమోదు చేసేందుకు బోర్డుకు జనవరి 5 వరకు గడువు ఇచ్చారు. ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడుతుంది. మొదటి సెషన్ జూలైలో నిర్వహించారు. రెండో సెషన్ డిసెంబర్‌లో నిర్వహించబడింది.
CTET ఫలితాలను మీరు ఈ క్రింది పద్ధతులు పాటించి తనిఖీ చేసుకోవచ్చు
ముందుగా మీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in సందర్శించాలి
ఆ తర్వాత మీకు నేరుగా హోమ్ పేజీలో LATEST NEWS విభాగంలో (CTET Dec 2024 Result) అని కనిపిస్తుంది
అక్కడ మీరు దానిని క్లిక్ చేస్తే మరో లింక్‌కు వెళతారు
అప్పుడు మీరు మీ రోల్ నంబర్ నమోదు చేసి పక్కన submit బటన్ నొక్కితే మీ ఫలితాలు కనిపిస్తాయి
ఇప్పుడు మీ CTET ఫలితాలు మీ ముందు కనిపిస్తాయి
మీరు దానిని భవిష్యత్తు అసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి
CTET ఫలితాల్లో కనీస మార్కులు
CTET పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, అభ్యర్థులందరూ కనీస మార్కులను స్కోర్ చేయడం అవసరం. సమాచారం కోసం ప్రతి వర్గానికి ఈ కనీస మార్కులు వేర్వేరుగా ఉంటాయి. దీని ప్రకారం జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 60% మార్కులు సాధించాలి. షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులం, OBC వర్గానికి చెందిన అభ్యర్థులు CTET పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 55% మార్కులు సాధించాలి.
ఏ అభ్యర్థి అయినా తన కేటగిరీ ప్రకారం కనీస మార్కులను స్కోర్ చేయకపోతే, వారు పరీక్షలో విఫలమైనట్లు పరిగణించబడతారు. దీంతో పాటు సీటెట్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు ఉపాధ్యాయులు అయ్యే అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జీవితకాల చెల్లుబాటుతో CTET సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది
ఇవి కూడా చదవండి:
Indian Air Force: యువతకు జాబ్ ఆఫర్స్.. ట్రైనింగ్‌లోనే నెలకు రూ. 40 వేలు
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Education News and Latest Telugu News
Updated Date - Jan 09 , 2025 | 04:36 PM