NCB recruitment 2025: నార్కోటిక్ బ్యూరోలో ఉద్యోగాలు రెడీ..నో ఎగ్జామ్, 56 ఏళ్ల వరకూ ఛాన్స్.
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:08 PM
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న అభ్యర్థులకు అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న NCB 123 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

పోలీస్ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇటీవల 123 ఖాళీలకు నోటిఫికేషన్ ప్రకటించింది. వీటిలో, 94 పోస్టులు ఇన్‌స్పెక్టర్ కాగా, 29 పోస్టులు సబ్-ఇన్స్పెక్టర్లకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ ఖాళీలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ సహా ప్రాంతాల్లో కూడా ఈ ఖాళీలు ఉన్నాయి.
NCB అర్హత ప్రమాణాలు 2025
అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. NCB రిక్రూట్‌మెంట్ 2025 కింద ఇన్‌స్పెక్టర్ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ క్రింది అర్హత ప్రమాణాలను పాటించాలి.
ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత గ్రేడ్‌లో సర్వీస్ అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే వారి గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా ఉంది. ఇక శాలరీ విషయానికి వస్తే 7వ CPC ప్రకారం (రూ.9300-34800 + గ్రేడ్ పే రూ.4600) లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఎంపిక విధానం
డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకంలో, అభ్యర్థులు వారి గత పనితీరు, అనుభవం, ఇతర అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడదు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు అధికారిక NCB వెబ్‌సైట్ http://narcoticsindia.nic.in/ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, వయో సంబంధిత సర్టిఫికేట్లు, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్‌ను ఫారమ్‌తోపాటు పోస్టుల ఆధారంగా ఈ క్రింది ప్రాంతాలకు పంపించాలి.
ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం: డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (P&A), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వెస్ట్ బ్లాక్ నం.1, వింగ్ నం.5, ఆర్.కె. పురం, న్యూఢిల్లీ – 110066.
సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం: డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్.), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, 2వ అంతస్తు, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ – 110066.
దరఖాస్తు గడువు:
నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 60 రోజులలోపు దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు గడువు తేదీని గమనించి, సమయానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
సూచనలు:
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి, అన్ని అర్హతలను పరిశీలించాలి
దరఖాస్తు సమర్పించే ముందు, అన్ని అవసరమైన పత్రాలు, సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి
దరఖాస్తు గడువు తేదీని మర్చిపోకుండా, సమయానికి ముందుగా దరఖాస్తు సమర్పించాలి
ఇవి కూడా చదవండి:
కోతి కోసం వీళ్ల సాహసానికి సెల్యూట్
Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News