Hormonal Balance: శరీరంలో హార్మోన్‌ల సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM
మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరంలో హార్మోన్ల సమతౌల్యం ఎంతో కీలకం. మరి ఈ సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం కీలకం. ఆకలి, బరువు, మానసిక స్థితి, చర్మ, కేశాల ఆరోగ్యం వంటి వాటిని హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. ఇక వయసు, ఆహారపు అలవాట్లు, కసరత్తులు చేసే అలవాటు వంటివన్నీ హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఇక శరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం దెబ్బతింటే డయాబెటిస్, సంతానలేమి, మానసిక సమస్యలు వంటి అనేక ఇబ్బందులు మొదలవుతాయి. మరి ఈ సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
బరువు పెరిగితే హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపిస్తుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన, పోషకాహారం తింటూ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే కలకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు (Health).
Drinking from Cans: నేరుగా క్యాన్స్ నుంచి డ్రింక్ చేసే వారు తెలీక చేసే పొరపాటు ఇదే!
ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు కూడా హార్మోన్ల మధ్య సమతౌల్యాన్ని పునరుద్ధరిస్తాయి
నిద్రలేమి హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే సగం సమస్యలు దూరమవుతాయి.
పోకాహారం కూడా హార్మోన్ సమతౌల్యానికి కీలకం. ముఖ్యం మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్న ఫుడ్ తినాలి.
Microplastics: మైక్రోప్లాస్టిక్స్‌తో మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు.. కొత్త అధ్యయనంలో వెల్లడి
ఇక పేగుల్లోని హితకర బ్యాక్టీరియా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అవసరం
క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే హార్మోన్లపై నియంత్రణ పెరిగి మూడ్ మెరుగవుతుంది. ఎయిరోబిక్ ఎక్సర్‌సైజులు, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్క్‌అవుట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి.
చక్కెరలు అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం అన్ని రకాలుగా శ్రేయస్కరం
ఇక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న ఫుడ్స్ కూడా తగినంత హార్మోన్‌ల ఉత్పత్తికి, సమతౌల్యానికి కీలకం. ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.