NASA Crew 10 Mission: నాసా క్రూ-10 మిషన్ ప్రారంభం.. త్వరలో భూమ్మీదకు చేరనున్న సునీతా విలియమ్స్
ABN , Publish Date - Mar 15 , 2025 | 07:04 AM
తొమ్మది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమ్మీదకు చేరనున్నారు. ఈ దిశగా నాసా, స్పెస్ ఎక్స్ సంస్థలు క్రూ -10 మిషన్‌ను ప్రారంభించాయి.

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రొనాట్ బుచ్ విల్‌మోర్‌ను సురక్షితంగా భూమ్మీదకు చేర్చే ప్రయత్నం ప్రారంభమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA), స్పేస్ ఎక్స్‌లు ఇద్దరు వ్యోమగాములను కాపాడేందుకు క్రూ-10 మిషన్‌ను శుక్రవారం ప్రారంభించాయి. ఇందులో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - 9 రాకెట్.. నలుగురు వ్యోమగాములున్న డ్రాగన్ వ్యోమనౌకతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.03 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మార్చి 15న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్‌కు చేరుకుంటుందని నాసా వెల్లడించింది (NASA Crew 10 Mission).
H-1B Visa: అమెరికాకు.. ఇప్పుడొద్దులే!
ఈ మిషన్‌లో భాగంగా ఆనీ మెక్లెయిన్, నికోల్ ఆయర్స్, జపానకు చెందిన టకూయా ఓనిషి, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. అనంతరం, వారి స్థానంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్‌లో భూమ్మీదకు చేరుకోనున్నట్టు నాసా ఓ ప్రకటన తెలిపింది. అంతా అనుకూలిస్తే మార్చి 19న డ్రాగన్ క్యాప్సూల్ వ్యోమనౌక తిరుగుప్రయాణమవుతుందని వివరించింది.
Donald Trump: ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరువాత స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వ్యోమగాములు తీసుకొచ్చే మిషన్ బైడన్ కారణంగానే ఆలస్యమైందని ఇటీవల ట్రంప్ ఆరోపించారు. దీంతో, ఈ ఉదంతం రాజకీయ మలుపు తిరిగింది. ఇక సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉంటున్నందుకు సునీతా విల్‌మోర్, బుచ్ విల్‌మోర్ ఆరోగ్యంపై ఆందోళన కూడా వ్యక్తమమైంది. ఈ నేపథ్యంలో సునీతా, విల్మోర్ ఇద్దరు సురక్షితంగా భూమ్మీదరకు చేరుకునేందుకు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
Read Latest and International News