Share News

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Mar 15 , 2025 | 07:03 AM

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: హోలీ పండుగ రద్దీని పురస్కరించుకొని చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి (08579), 17వ తేదీ ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు(08580) ప్రత్యేకరైళ్లు బయల్దేరతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Ponnam Prabhakar: ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి.. నిరసనలు తెలపడం హాస్యాస్పదం


city1.2.jpg

ఈ రైళ్లకు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ(Piduguralla, Sattenapalli, Guntur, Vijayawada), ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని(Rajahmundry, Samarlakota, Annavaram, Tuni), యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో హాల్టింగ్‌ సదుపాయం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లలో టూటైర్‌, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌క్లాస్‌తో పాటు జనరల్‌, సెకండ్‌ క్లాస్‌ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 15 , 2025 | 07:03 AM