Viral Video : ఈ సింపుల్ టెస్ట్‌తో.. నకిలీ పనీర్ ఏదో ఈజీగా కనిపెట్టేయవచ్చు..

ABN, Publish Date - Feb 09 , 2025 | 03:13 PM

మార్కెట్లో ఈ మధ్య నకిలీ పనీర్ అమ్మకం పెరిగిపోతోంది. మీరూ పనీర్ ఇష్టంగా తినేవారిలో ఒకరైతే బీ అలర్ట్. ఇక నుంచి ఇంట్లో పనీర్ వండే ముందు ఈ సింపుల్ టెస్ట్ చేయండి. నిజమైన పనీర్‌కూ, నకిలీ పనీర్‌కూ మధ్య తేడా ఇట్టే కనిపెట్టేయవచ్చు.

Viral Video : ఈ సింపుల్ టెస్ట్‌తో.. నకిలీ పనీర్ ఏదో ఈజీగా కనిపెట్టేయవచ్చు..
identify Fake paneer with this simple test

భారతీయ వంటకాల్లో వాడే ముఖ్యమైన పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. దేశంలో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ చాలా ఐటమ్స్‌లో పనీర్ మెయిన్ ఇంగ్రిడియెంట్. ఇంట్లో కూడా తరచూ ఎక్కువ మంది పనీర్ కర్రీస్ చేసుకుంటూ ఉంటారు. మీరూ పనీర్ ఇష్టంగా తినేవారిలో ఒకరైతే జాగ్రత్త. ఈ మధ్య మార్కెట్లో నకిలీ పనీర్ అమ్మకం పెరిగిపోతోంది. చాలా చోట్ల తెలిసి కొందరు, తెలియక మరికొందరు బ్రెడ్ పకోడాలు, పనీర్ కర్రీస్ వంటి పదార్థాలు తయారుచేస్తున్నారు. ఇటీవల ఓ హర్యానా వ్లోగర్ దీనికి సంబంధించింది ఓ వీడియో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయింది. పనీర్ క్వాలిటీని చెక్ చేసేందుకు అతడు చేసిన చిన్న ప్రయోగం గురించి మీరూ తెలుసుకోండి.


నకిలీ పనీర్ అంటే ఏమిటి?

మార్కెట్లలో తరచుగా అమ్ముడవుతున్న నకిలీ పనీర్ పామాయిల్, స్టార్చ్ ఇతర రసాయనాల మిశ్రమంతో తయారు చేస్తారు. చూసేందుకు ఇది నిజమైన పనీర్‌లాగే ఉంటుంది. చౌకగా కూడా లభిస్తుంది. అదీగాక వినియోగదారులు నిజమైన, నకిలీ పనీర్ మధ్య తేడాను అంత సులువుగా కనిపెట్టలేరు. నిజమైన పనీర్ పాలతో తయారుచేస్తారు. గట్టి ఆకృతిని కలిగి పాల వాసనతోనే ఉంటుంది.


హర్యానాకు చెందిన ఇన్‍‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రత్యక్షంగా బ్రెడ్ పకోడాలలో ఎలాంటి పనీర్ వాడుతున్నారో ప్రత్యక్షంగా పరీక్షిస్తూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ సైని చేసిన 'బ్రెడ్ పోక్రా క్వాలిటీ చెక్' ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 18 మిలియన్ల వ్యూస్ సాధించింది.


నకిలీ పనీర్ ఎలా కనిపెట్టాడంటే?

వైరల్ వీడియోలో ముందుగా బ్రెడ్ పకోడాలో ఉన్న జున్ను పరీక్షించడానికి గోరువెచ్చని నీటిలో ముంచి తర్వాత అయోడిన్ టింక్చర్ వేశాడు. ఆ వెంటనే పనీర్ నల్లగా మారిపోయింది. ఇది రసాయనాలతో తయారుచేశారనేందుకు సూచిక. తర్వాత అదే విధంగా మరో పనీర్ ముక్కను పరీక్షించి చూశాడు. ఈ సారి మాత్రం పనీర్ నల్లగా మారలేదు. కాబట్టి ఇది నిజమైనది అని స్పష్టమైనది నిఖిల్ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు, ఈ పరీక్ష తప్పని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!

Constipation Effects : 'దీర్ఘకాలిక మలబద్ధకం' తీవ్రమైన వ్యాధిగా మారవచ్చు.. ముప్పు తప్పాలంటే ఇలా చేయండి..

Updated Date - Feb 09 , 2025 | 03:14 PM