Share News

Hyderabad: ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 07:55 AM

ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే... 74 ఏళ్ల వృద్ధుడు తన అనే వారు ఎవరూ లేకుండానే ఒంటరిగా విమానంలో ప్రయాణి చేస్తున్నాడు. అయితే.. ఇంతలోనే అతను తీవ అస్వస్తతకు గురయ్యాడు. అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్ అతనికి చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడింది.

Hyderabad: ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే.. ఏం జరిగిందంటే..

  • విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత

  • కాపాడిన నగర డాక్టర్‌

  • కోలుకున్న బాధితుడు

హైదరాబాద్‌ సిటీ: ఇండిగో విమానం(Indigo flight)లో తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రయాణికుడికి హైదరాబాద్‌ డాక్టర్‌ ప్రీతిరెడ్డి సత్వర(Hyderabad Dr. Preethi Reddy Satvara) వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. విమానంలో శనివారం అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణి చేస్తున్న 74 ఏళ్ల వృద్ధుడికి అకస్మాత్తుగా మగత, నోటి నుంచి ద్రవం కారడం, మూత్రం పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దారుణం.. పెళ్లిపత్రికలు పంచేందుకు వెళ్తుండగా హత్య


city2.2.jpg

అదే విమానంలో ప్రయాణిస్తున్న మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్‌ జనరల్‌ ఫిజిషియన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రీతిరెడ్డి వెంటనే స్పందించారు. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి సీపీఆర్‌ చేశారు. బాధితుడు కొన్ని నిమిషాల్లోనే స్పందించారు. ఆన్‌బోర్డ్‌ మెడికల్‌ కిట్‌ను ఉపయోగించి అవసరమైన మందులను బాధితుడికి ప్రీతిరెడ్డి అందించారు.


స్పృహలోకి వచ్చిన తర్వాత, తనకు హైపర్‌టెన్షన్‌(Hypertension) ఉందని, కార్డియాక్‌ యాంజియోప్లాస్టీ చేయించుకున్నానని చెప్పాడు. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే, బాధితుడిని తదుపరి సంరక్షణ కోసం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి, ప్రాణాపాయం నుంచి రక్షించిన డాక్టర్‌ ప్రీతిరెడ్డిని క్యాబిన్‌ సిబ్బంది, తోటి ప్రయాణికులు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2025 | 07:55 AM