ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Three Gorges Dam Of Space: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

ABN, Publish Date - Jan 10 , 2025 | 05:37 PM

Three Gorges Dam Of Space: విద్యుత్ వినియోగానికి సౌరశక్తిని సైతం ఒడిసి పట్టాలని చైనా నిర్ణయించింది. అందుకోసం చైనా.. తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్‌ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనుంది.

China wants to develop 'Three Gorges Dam of space'.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. చైనా. అలాంటి చైనా.. శాస్త్ర సాంకేతికను అంది పుచ్చుకొని.. ఎప్పటి కప్పుడు కాలంతోపాటు పోటీ పడుతూ అప్ డేట్ అవుతోంది. అలాగే దేశంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మించి నీటిని సైతం నిల్వ చేస్తోంది. ఆ క్రమంలోనే త్రీగోర్జెస్ డ్యామ్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా నీటిని నిల్వ చేసి.. ప్రపంచాన్ని సైతం అబ్బుర పరిచింది. ఈ ప్రాజెక్ట్‌ కారణంగా చైనా పేరు ప్రఖ్యాతలు ఖండంతరాలను దాటింది. ఇక దేశంలో విద్యుత్ వినియోగానికి సౌరశక్తిని సైతం ఒడిసి పట్టాలని నిర్ణయించింది. అందుకోసం చైనా.. తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్‌ వెడల్పుతో భారీ సౌరశ్రేణిని ఏర్పాటు చేయనుంది. అదికూడా భూ వాతావరణంలో వచ్చే మార్పులు, రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌర శక్తిని సేకరించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ లాంగ్‌లెహావో దీనిపై స్పందించారు.


ప్రస్తుతం తాము ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నామన్నారు. దీనిని భూస్థిరకక్ష్యలోకి తరలించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన ప్రాజెక్ట్‌‌గా అభివర్ణించారు. ఈ పద్ధతిలో ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి.. భూమి లోపలి నుంచి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సరి సమానమని తెలిపారు. అంతేకాదు.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను త్రీగోర్జెస్ డ్యామ్‌తో లాంగ్‌లెహావో పోల్చడం విశేషం.

Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది


ప్రపంచంలోనే అతి పెద్ద జలవిద్యుత్ కేంద్రం త్రీగోర్జెస్ డ్యామ్. అంతరిక్షంలో నుంచి కనిపించే అతి తక్కువ నిర్మాణాల్లో ఇది ఒక్కటి. ఈ డ్యా్మ్ ద్వారా 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మూడు అణువిద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి ఇది సమానం. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ బరువు కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిందని గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: టీటీడీ చైర్మన్‌, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్

Also Read: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది


ఇక టిబెట్‌లోని భారత సరిహద్దు సమీపంలో యార్లంగ్ జంగ్బోగా ప్రసిద్ది పొందిన బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మిణానికి చైనా ఇటీవల ఆమోదముద్ర వేసింది. బ్రహ్మపుత్ర నది.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ నది ప్రవేశించే ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.137 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే.. దాని ముందు త్రీగోర్జెస్ ప్రాజెక్ట్ సైతం చిన్న బోనుందని ఓ చర్చ సైతం ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 06:27 PM