Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు జైలు... పాక్ కోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:41 PM
అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అవినీతి నిరోధక కోర్టుకు చెందిన న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పును వెల్లడించారు. వివిధ కారణాల వల్ల తీర్పును గతంలో మూడుసార్లు వాయిదా వేశారు.

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు గట్టి దెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ ట్రస్టు (Al-Qadir Trust)కు సంబంధించిన భూముల అవినీతి కేసులో ఇమ్రాన్‌కు 14 ఏళ్లు, ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ ఇస్లామాబాద్‌లోని అకౌంటబిలిటీ కోర్టు శుక్రవారంనాడు తీర్పునిచ్చింది. ఇద్దరికీ భారీ జరిమానా కుడా విధించింది. ఇమ్రాన్‌కు రూ.10 లక్షలు, బుష్రా బీబీకి రూ.5 లక్షలు జరిమానా విధించింది.
Canada : కెనడా అమ్మకానికి లేదు.. ట్రంప్‌కు ప్రతిపక్ష నేత జగ్మీత్ సింగ్ వార్నింగ్
అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అవినీతి నిరోధక కోర్టుకు చెందిన న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పును వెల్లడించారు. వివిధ కారణాల వల్ల తీర్పును గతంలో మూడుసార్లు వాయిదా వేశారు. బారిస్టర్లు గోహర్ ఖాన్, సోహైబె, షహీన్, సల్మాన్ అక్రం రజా, ఇతర లాయర్లుతో పాటు బుష్రా బీబీ కూడా తీర్పు సందర్భంగా జైలుకు హాజరయ్యారు. తీర్పు వెలువడగానే బుష్రాను కస్టడీలోకి తీసుకున్నారు. అడియాలో జైలులో ఆమె కోసం ఒక సెల్ కూడా సిద్ధం చేశారు.
ఇమ్రాన్‌పై ఆరోపణలు ఏంటి?
ఇమ్రాన్ దంపతులు పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసం అల్ ఖాదిర్ ట్రస్ట్‌ను 1996లో స్థాపించారు. ఈ ట్రస్టు రూ.50 కోట్ల మేరకు అవకతవకలకు పాల్పడినట్టు పాకిస్థాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) కేసు నమోదు చేసింది. బిలియన్లు విలువల భూములు, డబ్బు కాజేసిన ఆరోపణలను ఇమ్రాన్ దంపతులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 18న కేసు విచారణ ముగిసి తీర్పును డిసెంబర్ 23కు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత జనవరి 6కి వాయిదా పడింది. ఆ తర్వాత మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు శుక్రవారంనాడు తీర్పును ప్రకటించారు. ఖాన్, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు జైలులో ఉండటంతో దేశంలో రాజకీయ అస్థిరతను తొలగించేందుకు కొద్దికాలంగా ప్రబుత్వానికి, పీటీఐకి మధ్య సంప్రదింపులు సాగిస్తున్న నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. 2022లో అధికారం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచి డజనుకు పైగా కేసులను ఖాన్ ఎదుర్కొంటున్నారు. 2023 ఆగస్టు నుంచి జైలులో ఉంటున్నారు.
96 గంటల సుదీర్ఘ చర్చలు
‘హిండెన్‌బర్గ్ రిసెర్చ్’ మూసివేత
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..