Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే

ABN , Publish Date - Feb 14 , 2025 | 07:34 AM

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోదీ ట్రంప్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే
Donald Trump vs modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ప్రస్తుతం రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఫిబ్రవరి 14న (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ సమావేశం తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను ఇండియాకు అప్పగించడానికి ఆమోదించారు. దీంతో ఇప్పుడు అతను భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రధాని మోదీ ట్రంప్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.


సుప్రీంకోర్టు ఆమోదం

తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


రాణా పాత్ర

ముంబై దాడి చార్జిషీట్ ప్రకారం తహవ్వూర్ రాణా ఈ దాడి ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సహాయం చేశాడు. ఆయన ISI (ఇంటర్నేషనల్ సర్వీస్ ఇంటెలిజెన్స్), లష్కరే తోయిబా (LeT) సభ్యుడిగా కూడా ఉన్నాడు. రాణా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ జైలులో ఉన్నాడు.


జాతీయ భద్రతా సలహాదారుడిని

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మరో కీలక సమావేశం నిర్వహించారు. ఆయన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడైన మైఖేల్ వాల్ట్జ్‌ను కూడా కలిశారు. ఈ సమావేశం తర్వాత, ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. NSA మైఖేల్ వాల్ట్జ్‌తో జరిగిన సమావేశం చాలా అనుకూలంగా సాగిందని మోదీ అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా భారతదేశానికి మంచి స్నేహితుడని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.


భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు

ప్రధాని మోదీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్-అమెరికా సంబంధాలలో రక్షణ, సాంకేతికత, భద్రత కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఈ అంశాలపై ఆయన మైఖేల్ వాల్ట్జ్ తో చర్చలు జరిపారని చెప్పారు. దీంతోపాటు "కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, అంతరిక్షం, తదితర రంగాలలో కలిసి పని చేసే బలమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని అన్నారు.

జాతీయ నిఘా డైరెక్టర్‌తో సమావేశం

ప్రధానమంత్రి మోదీ తన పర్యటనలో మరో ముఖ్యమైన సమావేశం కూడా నిర్వహించారు. ఆయన అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను బ్లెయిర్ హౌస్‌లో కలిశారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా Xలో తులసి గబ్బర్డ్‌ను అభినందించారు. ఈ పదవికి గబ్బర్డ్ నియామకం పట్ల అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 14 , 2025 | 07:39 AM