UNICEF: 2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు.. సేవ్ చేయలేమా..
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:12 PM
పలు రకాల సమస్యలు సంక్షోభంగా మారిపోతున్నాయి. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి 47 కోట్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని యూనిసేఫ్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలని నివేదిక కోరింది.

పలు సంక్షోభాల కారణంగా ప్రపంచంలో అనేక మంది చిన్నారుల భవిష్యత్తుపై 2025 ప్రభావం ఉంటుందని ఐక్యరాజ్యసమితి బాలల నిధి (UNICEF) తెలిపింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల మంది పిల్లలు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. 2025లో పిల్లల అవకాశాలు: పిల్లల భవిష్యత్తు కోసం స్థితిస్థాపక వ్యవస్థలను నిర్మించడం అనే పేరుతో ఓ నివేదికను వెలువరించింది. ఈ క్రమంలో 2023 నాటికి ప్రపంచంలో 473 మిలియన్లకు పైగా పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని రిపోర్ట్ తెలిపింది. ఇది ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు యుద్ధం, భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభావితమవుతున్నట్లు పేర్కొంది.
రుణ సంక్షోభం ప్రభావం కూడా..
1990లతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యిందని, ఘర్షణ ప్రాంతాలలో పిల్లలు అధికంగా ఆకలి, వ్యాధులు, స్థానభ్రంశం, మానసిక దాడుల్ని ఎదుర్కొంటున్నారని యూనిసేఫ్ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు ప్రపంచంలో 400 మిలియన్ల మంది పిల్లలు రుణాల బాదిత దేశాలలో నివసిస్తున్నారు. ఈ దేశాలలో శ్రేయస్సు కోసం అత్యవసరమైన అంశాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలపై కేటాయింపులు తగ్గాయి. ఈ క్రమంలో 15 ఆఫ్రికన్ దేశాలలో రుణ చెల్లింపులు విద్యకు కేటాయించిన నిధుల్ని మించి ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం రుణ చెల్లింపులు విద్యపై ఖర్చును 12.8 బిలియన్లు తగ్గించగలవు. దీంతో 1.8 బిలియన్ల మంది పిల్లలు ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు.
వాతావరణ మార్పు ప్రభావాలు
ప్రపంచ వాతావరణ మార్పుల కారణంగా పిల్లలకు సంబంధించిన సేవలు బలహీనపడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్య, మానసిక శ్రేయస్సుకు మద్దతు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ వాతావరణం ప్రకారం పిల్లల ప్రతిస్పందించే చొరవలకు కేవలం 2.4% మాత్రమే కేటాయించబడుతోంది. దీంతో పిల్లలకు అవసరమైన సేవలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది.
డిజిటల్ అసమానత
డిజిటల్ అసమానత ప్రపంచంలో పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాలలో 15-24 ఏళ్ల వయస్సు కలిగిన యువతకి అధిక ఆదాయ దేశాలలో ఇంటర్నెట్ సదుపాయం ఉంది. కానీ ఆఫ్రికాలో 53% మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అలాగే బాలికలు, వైకల్యాలున్న పిల్లలు ఈ డిజిటల్ అసమానతను మరింత అనుభవిస్తున్నారు.
సిఫార్సులు
ఈ నివేదిక ప్రపంచానికి, ప్రభుత్వాలకు సూచన లాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే బలమైన సామాజిక వ్యవస్థలను నిర్మించడం, పిల్లల హక్కులను గౌరవిస్తూ, సమగ్ర, జవాబుదారీ విధానాలను తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలకు నివేదిక సూచించింది. దీంతో పాటుగా డిజిటల్ సేవల్లో పిల్లల హక్కులను మరింత పటిష్టంగా ఇంటిగ్రేట్ చేయాలని కోరింది.
ఇండియాలో ఎంత మంది..
భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. 163 దేశాలలో భారతదేశం 26వ స్థానంలో ఉంది. అంటే తీవ్ర వేడి, వరదలు, వాయు కాలుష్యం వంటి ప్రమాదాలను పిల్లలు ఎదుర్కొంటున్నారు. 2000ల తర్వాత వేడి గాలులకు గురైన పిల్లల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. అలాగే బాల కార్మికుల సమస్య కూడా అనేక ప్రాంతాలలో పెరుగుతోంది. భారతదేశంలో 259.6 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 10.1 మిలియన్ల మంది చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర పనులలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
యునిసెఫ్ గురించి..
యునిసెఫ్ 1946లో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 190 కి పైగా దేశాలలో పనిచేస్తోంది. భారతదేశంలో 1949లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పిల్లల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆహారం, ఆరోగ్యం, విద్య, భద్రత, పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ భారతదేశంలోని లక్షలాది పిల్లలకు సేవలు అందిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News