Share News

Best School For Kids: పిల్లలకు ఎలాంటి స్కూల్‌ మంచిది..

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:57 AM

Best School For Kids: పిల్లలను స్కూల్‌‌కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.

Best School For Kids: పిల్లలకు ఎలాంటి స్కూల్‌ మంచిది..
Best School For Kids

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా వారి చదువు విషయానికి వస్తే మాత్రం మరింత ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. వారిని ఏ స్కూల్‌లో (Best School For Kids) జాయిన్‌ చేయాలి.. ఏ స్కూల్‌లో వేస్తే వారికి బంగారు భవిష్యత్ ఇవ్వగం అని ఆలోచన చేస్తుంటారు. అయితే ఇండియాలో విద్యా విదానాలు, స్కూల్ ఎంపిక విషయాల్లో భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో పిల్లల స్కూల్ విషయాల్లో కీలక విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్కూల్‌ ఎంపిక అనేది పిల్లల భవిష్యత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఏ స్కూల్‌లో వేయాలని, ఎలాంటి విద్యను అందించాలి, అలాగే ఆర్థిక విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


స్కూల్ దూరం, సౌలభ్యం

స్కూల్‌ను ఎంపిక చేసుకునే ముందు చాలా ముఖ్యమైంది.. స్కూల్‌ ఎంత దూరం ఉంది అనేది. ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరంలో ఉంది.. ఎక్కువ దూరం ఉంటే ప్రయాణంలోనే సమయం గడిచిపోతుందా.. దీని వల్ల చదువు, ఆటలపై ప్రభావం పడుతుందా అనేది తెలుసుకోవాలి. 20 నిమిషాల కంటే ఎక్కువ ప్రయాణం చేసే పిల్లలో నీరసం, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా స్కూల్‌ను ఇంటికి సమీపంలో ఉండేలా చూసుకుంటే మంచిది. అలాగే రవాణా సౌకర్యం కూడా చూసుకోవాలి.


విద్యా ప్రమాణాలు.. టీచింగ్

స్కూల్లో విద్యా ప్రమాణాలపై అవగాహన ఉండాలి. ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ ఇలా ఏ బోర్డు అయినా కావొచ్చు.. ప్రతీ బోర్డుకు దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సీబీఎస్‌సీ బోర్డు నేషనల్ వైస్‌గా పోటీలకు సిద్ధం చేస్తే.. ఐసీఎస్‌సీ ఇంగ్లీష్, సాహిత్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. స్కూల్‌ ఎలా ఉంటుంది.. గత ఫలితాలు, టీచింగ్, టీచర్లకు ఉన్న అర్హతలు వంటివి తెలుసుకోవడం ముఖ్యం.


స్పెషల్ ఆక్టివిటీస్..

పిల్లలకు చదవుతో పాటు ఇతర ఆక్టివిటీస్‌ కూడా చాలా ముఖ్యం. చదువుతో పాటు క్రీడలు, కళలు, సంగీతం వంటివి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడతాయి. స్కూల్‌లో లైబ్రరీ, ఆటలు ఆడేందుకు స్థలం, క్లబ్‌లు ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. క్రీడా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. సహపాఠ కార్యక్రమాల వల్ల పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎంపిక చేసే స్కూల్లో ఇవి ఉన్నాయో లేవో తెలుసుకోవాలి.


ఖర్చు, ఆర్థిక సామర్థ్యం

స్కూల్‌ ఎంపిక ముందే స్కూల్‌ ఫీజును కూడా మనం అంచనా వేసుకోవాలి. స్కూల్‌ ఫీజు అనేది కుటుంబం ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు స్కూల్లో ఫీజులు అధికం. అంతే కాకుండా రవాణా, యూనిఫాం, పుస్తకాలు ఇలా అదనంగా ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం చదువుకు అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే ఈ స్కూళ్లలో సౌకర్యాలు కూడా స్వల్పమే అని చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబ బడ్జెట్‌ను ఆధారంగా మీ పిల్లలకు బెస్ట్‌ స్కూల్‌ను అందించాల్సిన అవసరం ఉంది.


స్కూల్‌లో భద్రత

ముఖ్యంగా స్కూల్‌ వాతావరణం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ వాతావరణం ఎలా ఉంది. పిల్లలు సురక్షితంగా ఉంటారా. పిల్లలతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎలా వ్యవహరిస్తారు అనేది తెలుసుకోవాలి. అంతే కాకుండా స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ, ఎమర్జెన్సీల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది తెలుసుకోవడం మంచింది. స్కూల్‌ను ఎంపిక చేసున్నప్పుడు.. పైన చెప్పిన విషయాలపై ఎంక్వైరీ చేయాలి. అంతే కాకుండా ఇతర తల్లిదండ్రులు అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి.


మొత్తానికి మంచి స్కూల్‌ ఎంపికతో పిల్లల భవిష్యత్‌కు పునాది వేయొచ్చు. స్కూల్‌ అనేది కేవలం చదవు కోసం మాత్రమే కాదు పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం కూడా. స్కూల్ దూరం, ఖర్చు, విద్యా ప్రమాణాలు, సెక్యూరిటీ వంటి విషయాలను ప్రధానంగా తెలుసుకోవాలి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వారికి తగ్గ స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యం. స్కూల్ ఎంపిక విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి

Donald Trump: మోదీ నా స్నేహితుడే కానీ.. ప్రతీకార సుంకాలపై ట్రంప్

Peacock: కుక్కల దాడి.. నెమలి మృతి

Read Latest Lifestyle News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 09:58 AM