AC Tips: AC శబ్దం చికాకు పెడుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో..
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:26 PM
AC Noise Solutions: వేసవి కాలం వచ్చిందంటే చాలు. ఏసీల వాడకం పెరిగిపోతుంది. పగలూ రాత్రి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. నెలల తరబడి సర్వీసింగ్ చేయకపోవడం.. ఇంకా అనేక ఇతర కారణాల వల్ల ఏసీలు ఆన్ చేసినప్పుడు పెద్ద శబ్దం వస్తూ ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ శబ్దాలు ఎందుకు వస్తాయి.. సింపుల్ ట్రిక్స్ ద్వారా ఆపే వీలుందా.. రండి, తెలుసుకుందాం..

AC Noise Solutions: సమ్మర్ సీజన్ రాగానే ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతాయి. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చల్లదనం కోసం అందరూ ఎయిర్ కండీషనర్లు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇళ్లంతా కూల్ కూల్ గా ఉండాలని రోజంతా ఆన్ మోడ్ లోనే ఉంచుతారు. ఇలా నిరంతరం పనిచేయడం వల్ల ఏసీలు కొన్నిసార్లు వింతశబ్దాలు చేస్తూ చికాకు పెడతాయి. పగలంతా ఈ సౌండ్ పెద్దగా ఇబ్బందిగా అనిపించకపోయినా.. రాత్రి పక్క మీదకి చేరి సుఖంగా నిద్రపోవాలని ఆశించినపుడే ఏసీ శబ్దం చెవులకు భయంకరమైన గోలలాగా అనిపిస్తుంది. అయితే, ఈ శబ్దాన్ని ఆపేందుకు ఈ కింది పాటిస్తే చాలు. సైలెంట్ అవడం ఖాయం.
ఎయిర్ ఫిల్టర్‌లో మురికి
ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము, ధూళి చేరితే అది గాలి ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. దీనివల్ల AC నుంచి శబ్దం చేస్తుంది. అందుకే ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. తరచూ ఏసీ ఫిల్టర్ తనిఖీ చేయాలి. గాలి చక్కగా ప్రసరించాలన్నా.. శబ్దం రాకుండా నివారించాలన్నా కనీసం నెలకు ఒకసారైనా ఎయిర్ ఫిల్టర్‌ను కచ్చితంగా శుభ్రం చేయాలి.
లూబ్రికేషన్
ఏసీ సరిగ్గా పనిచేయాలంటే లూబ్రికేషన్ తప్పనిసరిగా వాడాలి. నిరంతరం పనిచేసినపుడు రాపిడి కారణంగా శబ్దాలు ప్రారంభమవుతాయి. రిఫ్రిజరెంట్ లీక్ అయినా లేదా ఒత్తిడి ఎక్కువైనా హిస్సింగ్ లేదా విజిల్ సౌండ్ వస్తుంది. మోటాల్, బెల్ట్ కూడా ఈ శబ్దానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ సౌండ్ నిరోధించేందుకు లూబ్రికేషన్ వాడండి.
వదులుగా ఉన్న భాగాలను బిగించండి
ఏసీలోని ఫ్యాన్ బ్లేడ్‌లు లేదా ఇతర భాగాలు లూజ్ అయిపోతే విచిత్రమైనా శబ్దాలు వస్తాయి. కండెన్సర్‌లోని స్క్రూలను నిశతంగా పరిశీలించి అవి వదులుగా మారాయేమో గమనించండి. టెక్నీషియన్ సహాయంతో వాటి భాగాలను బిగించడం లేదా మార్చడం చేస్తే శబ్దం రాదు.
కంప్రెసర్
మోటార్ సమస్యలు, ఫ్యాన్ మోటార్ లేదా కంప్రెసర్ లోపాల వల్ల గ్రైండింగ్ లేదా బజ్ శబ్దం వస్తుంది. ఇలాంటప్పుడు AC కంప్రెసర్‌ను తనిఖీ చేసి శుభ్రం చేయడం అవసరం. పాత ఏసీ అయితే రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ గురించి ఆలోచించండి.
ఏసీ శుభ్రం చేయండి
ఏసీ శబ్దాన్ని తగ్గించేందుకు నెలకోసారి ఫిల్టర్ శుభ్రం చేయాలి. సంవత్సరానికోసారి పూర్తిగా సర్వీస్ చేయించాలి. అప్పుడే ఏసీ చక్కగా పనిచేస్తుంది. లేకపోతే దుమ్మూ, ధూళి పేరుకుపోతుంది.చిన్న సమస్యగా భావించి సరైన సమయంలో శ్రద్ధ వహించకపోతే శబ్దం చేస్తూ కొన్నాళ్లకే మూలన పడుతుంది. కాబట్టి, ఈ సులభమైన టిప్స్‌తో మీ ఏసీని సైలెంట్‌గా, సమర్థవంతంగా పనిచేసేలా చేయండి.
Read Also: Dust Cleaning Tips: క్లీన్ చేసిన తర్వాతా వస్తువులపై దుమ్ము కనిపిస్తోందా.. ఈ ట్రిక్‌తో..
Garlic Benefits: వెల్లుల్లి తొక్క తీసి వాడాలా.. తీయకుండా వాడాలా..
Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..