Reduce Belly Fat: జపనీస్ సీక్రెట్.. ఈ వాటర్ తాగితే బాన పొట్ట పరార్..
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:18 AM
Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందంటే దాన్ని కరిగించడం మాత్రం చాలా కష్టం.

ఊబకాయం.. ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కొంత మంది అధిక బరువును మాత్రం అధిగమించలేకపోతున్నారు. ఆరోగ్యకరమైన ఫుడ్, డైట్, వ్యాయామం ఇలా అనేక రకాలుగా బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్పటికీ వారికి నిరాశే ఎదురవుతుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఊబకాయం కారణంగా మానసిక ఒత్తిడికి కూడా గురవుతుంటారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతే దాన్ని కరిగించుకోడం చాలా కష్టమం. కానీ జపాన్‌లో ఓ సాంప్రదాయ చికిత్సతో ఈ బెల్లీ ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. కేవలం ఏడు నుంచి పదిరోజుల్లోనే కడుపు చుట్టూ కొవ్వు కరుగుతుండాన్ని గుర్తిస్తారు. ఇంతకీ జపనీయుల చికత్స ఏంటి.. ఎలా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలి.. అందుకోసం ఏం ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
జపనీస్ వాటర్ థెరపీ... ఇది జపాన్ దేశంలో ఓ సాంప్రదాయ చికిత్స. ఈ వాటర్ థెరపీ ద్వారా శరీరాన్ని మొత్తం శుభ్రం చేయడంతో పాటు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది కూడా. ఈ పానీయంతో ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. జపనీస్ వాటర్ థెరపీతో బెల్లీ ఫ్యాట్‌తో పాటు వీపు వద్ద ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది.
ఈ నీటిని ఎలా తాగాలి
జపసీస్ వాటర్ థెరపీని సరైన పద్దతిలో తీసుకుంటేనే దాని ప్రభావం కనిపిస్తుంది. ప్రతీ రోజు ఉదయం లేచిన వెంటనే పరగడుపు ఈ వాటర్‌ను తాగితే మంచి ఫలితాలు వస్తాయి. రాత్రి సమయంలో నెమ్మదించిన మెటబాలిజాన్ని ఆక్టివేట్ చేయడంతో పాటు శరీర ఉష్ణోగ్రతలను కూడా సమతుల్యం చేస్తుంది. ఈ వాటర్‌ను ఓకే సారి తాగకుండా కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల నెమ్మదిగా శరీరంలోకి చేరుతుంది. ప్రతీరోజు భోజనానికి ముందే రెండు సార్లు ఈ వాటర్‌ను తీసుకుంటే బెటర్.
ఎలా తయారు చేసుకోవాలి
జపనీస్ వాటర్ థెరపీ కోసం అందుబాటులో ఉండే పదార్థాలే అవసరం అవుతాయి. గోరువెచ్చని నీరు, సగం నిమ్మకాయ, కొన్ని దోసకాయ ముక్కలు, పుదీన ఆకులు. అలాగే అల్లం కూడా ఈ వాటర్‌లో వేసుకోవచ్చు. నిమ్మకాయ శరీరాన్ని ఆల్కలీన్ చేయగా.. దోసకాయ చల్లబరుస్తుంది. అలాగే పుదీన ఆకుల వల్ల కడుపు ఉపశమనం పొందుతుంది. ఇవన్నీ కలిసిన వాటర్ తాగడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేసి కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ వాటర్ తాగితే త్వరగా ఫలితాన్ని పొందవచ్చు.
ఇవి గుర్తించుకోవాలి
అయితే ఈ వాటర్‌ను సహజ పదార్థారాలతో తయారు చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. ఈ వాటర్‌ను ఎక్కువగా తాగినా, లేదా వేడి చేయకుండా తాగడం వల్ల గ్యాస్, ఆసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్న వారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం బెటర్. అయితే తక్కువ మోతాదులో ఈ నీటిని తీసుకుంటే మాత్రం శరీరానికి ఎలాంటి హానీ కలగదు.
రిజల్ట్ ఎన్నిరోజుల్లో
ప్రతీ రోజు ఈ పానీయాన్ని తీసుకుంటే కేవలం ఏడు నుంచి పది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. కడుపు తేలికగా ఉన్న భావన కలుగుతుంది. అంతేకాకుండా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఈ పానీయంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్రతో కూడా రెండు మూడు వారాల్లో బరువు తగ్గడం మొదలవుతుంది. జపనీస్ వాటర్ థెరపీ వల్ల ఒక్కసారిగా బెల్లి ఫ్యాట్ తగ్గడం జరగదు. ఆరోగ్యకరమైన పద్దతిలోనే క్రమ క్రమంగా బెల్లీ ఫ్యాట్ తగ్గడాన్ని మీరు గుర్తించవచ్చు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
Best Summer Spots: ఇండియా ది బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయండి..
Read Latest Life Style News And Telugu News