Share News

Benefits with Rice water: వావ్.. గంజి నీళ్లతో ఇన్ని ఉపయోగాలున్నాయా.. మొహానికి రాసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:25 PM

ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసం కూడా గంజిని వాడడం శతబ్దాలుగా ఉంది. కొరియన్ మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడానికి గంజిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గంజిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు కనిపిస్తాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే పలు ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

Benefits with Rice water: వావ్.. గంజి నీళ్లతో ఇన్ని ఉపయోగాలున్నాయా.. మొహానికి రాసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..
Benefits with Rice water

గంజి నీటితో (Rice Water) ఎన్నో ఉపయోగాలంటున్నాయని ఇప్పుడిప్పుడే అందరూ గ్రహిస్తున్నారు. గంజిలో ఉండే విటమిన్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తాయి. ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసం కూడా గంజిని వాడడం శతబ్దాలుగా ఉంది. కొరియన్ మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడానికి గంజిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గంజిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు కనిపిస్తాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే పలు ప్రయోజనాలను కూడా అందిస్తాయి (Benefits with Rice water).


గంజిలో విటమిన్ బీ1 విటమిన్ బీ3, విటమిన్ బీ5, విటమిన్ బీ6 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ బీ1 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ బీ2 చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, పొడి బారకుండా నిరోధిస్తుంది. విటమిన్ బీ3 చర్మంపై ముడతలు రావడాన్ని నిరోధిస్తుంది. విటమిన్ బీ5 చర్మాన్ని మృదువుగా చేస్తుంది. విటమిన్ బీ6 మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే గంజిలో ఉండే విటమిన్-ఇ యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.


గంజిని మీరు ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే గంజితో మొహాన్ని కడుక్కున్నా ఉపయోగం ఉంటుంది. గంజి మీ మొహాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మొటిమల నుంచి రక్షిస్తుంది. అలాగే మొహంపై చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, త్వరగా ముడుతలు రాకుండా నిరోధిస్తుంది. అయితే గంజి నీళ్లు అందరికీ సరిపడవు. కొందరికి అలెర్జీ కూడా కలిగించవచ్చు. కాబట్టి గంజి నీటిని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

Dry Fruits : మధుమేహంతో పోరాడటానికి ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.. వేటిని తీసుకోకూడదు..!

Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!


మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2025 | 04:25 PM