AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 08:05 AM
హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.

- హైడ్రా పేరిట లావాదేవీలపై కఠినచర్యలు
- కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ: హైడ్రా పేరిట ఎవరైనా లావాదేవీలు చేసినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) హెచ్చరించారు. ఆధారాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, నిరూపణ అయిన పక్షంలో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలుంటాయన్నారు. ఏసీబీ, విజిలెన్స్(ACB, Vigilance), స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తుందన్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి(MLA Anirudh Reddy) ఆరోపణలపై మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రంగనాథ్(Ranganath) స్పష్టతనిచ్చారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే ఎవరినీ వదలబోమని, అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రంగనాథ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News