Shopping: ఈ మార్కెట్ గురించి మీకు తెలుసా.. అన్నీ తక్కువ ధరకే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 02:04 PM
Best Shopping Markets: దేశ రాజధాని ఢిల్లీలో చాలా మార్కెట్లు ఉన్నాయి. అక్కడ అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. ముఖ్యంగా.. ట్రెండీ, కూల్ డ్రెస్సెస్ అతి తక్కువ ధరకే దొరకుతాయి. వేసవి కాలంలో మంచి మంచి బ్రాండెడ్ దుస్తులను, తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. తక్కువ ధరకే మంచి డ్రెస్సులు లభించే 4 బెస్ట్ మార్కెట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ఢిల్లీ, మార్చి 08: ప్రజలు కాలానుగుణంగా దుస్తులు ధరిస్తుంటారు. వర్షాకాలం, చలికాలం, వేసవి కాలాలకు అనుగుణంగా డ్రెస్సెస్ కొనుగోలు చేస్తుంటారు. అయితే, బట్టలు కొనుగోలు చేయడానికి ముందు ప్రజలు ఎక్కువగా నాణ్యతను, వాటి ప్రైజ్ గురించి ఆలోచిస్తుంటారు. తక్కువ ధరకే మంచి మంచి డ్రెస్సెస్, ఇతర వస్తువులు లభించే మార్కెట్‌లో దేశంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో చీప్ ప్రైజ్ అండ్ బెస్ట్ క్వాలిటీతో డ్రెస్సెస్ అమ్మే మార్కెట్‌లు కొన్ని ఉన్నాయి. అక్కడ ట్రెండీ, నాణ్యమైన డ్రెస్సులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ముఖ్యంగా వేసవిలో చౌకైన టీషర్ట్‌లు, షర్టులు, కాటన్ ప్యాంట్స్, కుర్తాలు, టాప్స్, స్కర్ట్స్, కాటన్ దుస్తులు తక్కువ ధరకే లభిస్తాయి. ఢిల్లీల చీప్ కాస్ట్‌కే బెస్ట్ క్వాలిటీ దుస్తులు లభించే మార్కెట్లు ఏవో ఓకసారి చూద్దాం..
సరోజిని నగర్ మార్కెట్..
సరోజినీ నగర్ మార్కెట్ న్యూఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన మార్కెట్. వేసవి స్పెషల్ కలెక్షన్స్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే.. సరోజినీ మార్కెట్ బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ధరకే మీకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. బ్రాండెడ్ ఓవర్‌స్టాక్, ఇంపోర్టెడ్ డ్రెస్సెస్ ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయి. ధర కేవలం రూ. 100 నుండి ప్రారంభమవుతుంది. ఫ్యాషన్ ఫ్రెండ్లీ వ్యక్తులకు ఇది బెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. అయితే, ఇక్కడ బేరం ఆడితే.. రేటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్‌లో ఉంది. దీనికి సమీపంగా సరోజిని నగర్ మెట్రో స్టేషన్ కూడా ఉంది.
జనపథ్ మార్కెట్..
ఇది పర్యాటకులకు ఇష్టమైన మార్కెట్. ఇక్కడ బోటిక్ శైలి దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వేసవికి సంబంధించి ప్రత్యేకమైన దుస్తులు కొనుగోలు చేయడానికి వీలుంటుంది. తేలికైన కాటన్ ఖాదీ దుస్తులు, కుర్తాలు, స్టైలిష్ షర్ట్‌లు, టీ షర్ట్‌లు కొనుగోలు చేయొచ్చు. ధర రూ. 150 నుండి రూ. 500 వరకు ఉంటుంది. అంతేకాదండోయ్.. ఇండియన్, వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సెస్ ఇష్టపడే వారికి ఈ మార్కెట్ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఈ మార్కెట్ కన్నాట్ ప్లేస్‌లో ఉంది. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఈ మార్కెట్‌కు సమీపంగా ఉంటుంది.
లక్ష్మీ నగర్ మార్కెట్..
ఈ మార్కెట్ తూర్పు ఢిల్లీ ఫ్యాషన్ హబ్. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ షాపింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాలేజీ స్టూడెంట్స్‌కి, తక్కువ బడ్జెట్‌లో మంచి డ్రెస్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ప్లేస్. వేసవి కుర్తాలు, షర్టులు, జీన్స్ ఇక్కడ చాలా చౌక ధరలకే లభిస్తాయి. ధర విషయానికి వస్తే.. రూ. 200 నుండి రూ. 700 వరకు ఉంటుంది. బేరం ఆడితే మరింత ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్‌కు వెళ్లాలంటే.. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌కు వెళ్లాలి. దీనికి సమీపంలో లక్ష్మీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది.
బోనస్ మార్కెట్ - పాలికా బజార్..
ఈ మార్కెట్‌లో చాలా చౌక ధరలకే డ్రెస్సెస్ కొనుగోలు చేయొచ్చు. వేసవి కాలానికి దుస్తులను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ మార్కెట్ బెటర్ అని చెప్పొచ్చా. ఇక్కడ తక్కువ ధరలకే టీ-షర్టులు, షర్టులు, ట్రాక్ ప్యాంట్లు, కాటన్ దుస్తులను కనుగొలు చేయవచ్చు. ధర రూ. 150 నుండి రూ. 600 వరకు ఉంటుంది. బేరం ఆడితే రేట్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్‌కు సమీపంలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఉంటుంది.
Also Read:
బ్రాహ్మణి గురించి ఇంట్రస్టింగ్ వివరాలు చెప్పిన మంత్రి లోకేష్..
24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
దుబాయ్ ఎరుపెక్కాల.. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా..
For More Lifestyle News and Telugu News..