Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.. వెంటనే వీటిని విసిరిపారేయండి..
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:14 PM
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం మంచిది కాదు. మీరు ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు నష్టం జరగవచ్చు. అయితే, ఏ వస్తువులు ఇంట్లో ఉంచడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు చిట్కాలు: ఇల్లు కట్టే సమయంలో చాలా మంది వాస్తు శాస్త్రం ఉపయోగిస్తారు. ఎందుకంటే, ఈ గ్రంథం ప్రకారం ఇంటి పనులు చేస్తే వాస్తు దోషం ఉండదనే నమ్మకం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు కడితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అయితే, ఆ ప్రకారంగా ఇల్లు కట్టినప్పట్టికీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, శాంతిని కోల్పోతారు. ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు నష్టం జరగవచ్చు. అయితే, ఆ వస్తువులు ఏంటి? ఎందుకు వాటిని ఇంట్లో ఉంచకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మంచం కింద వస్తువులు
చాలా మంది తమ ఇంట్లో స్థలం ఎక్కువగా లేకపోవడంతో తరచుగా మంచం కింద వస్తువులను ఉంచుతారు. అయితే, ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి. మంచం కింద వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.
సాడ్ పెయింటింగ్స్
వాస్తు శాస్త్ర ప్రకారం, ఒంటరితనాన్ని లేదా ఏదైనా విచారకరంగా అనిపించే పెయింటింగ్స్ ను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. అలాంటి పెయింటింగ్‌లు ఇంట్లోని సానుకూలతను తొలగిస్తాయని, ప్రతికూల శక్తిని పెంచుతాయని వాస్తు శాస్త్ర చెబుతుంది.
ముళ్ళు ఉన్న మొక్కలు
చాలా మంది తమ ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుకుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ముళ్ల మొక్కలను అస్సలు ఉంచకూడదు. ఈ మొక్కలను ఉంచడం వల్ల ఇంటి వాతావరణం చెడిపోతుంది, తగాదాలు పెరుగుతాయి.
విరిగిన వస్తువులు
వాస్తు శాస్త్ర ప్రకారం, పగిలిన అద్దం లేదా గాజును ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. విరిగిన విగ్రహాలు, ఆగిపోయిన గడియారాలను ఇంటి నుండి బయటకు విసిరేయాలి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
(NOTE: పై సమాచారం వాస్తు శాస్త్ర నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
Tips To Remove Tanning Skin: ఎండకు స్కిన్ ట్యాన్ అయిందా.. ఈ 5 చిట్కాలతో తక్షణమే మాయం..
Mary Kom Divorce: భర్తకు మేరీకోమ్ విడాకులు.. వెలుగులోకి సంచలన నిజాలు
Mark Shankar Pawanovich: పవన్ కళ్యాణ్ కొడుకు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడంటే..