Suvendu Adhikari: ప్రాణభయంతో ఇళ్లు వీడిపోయిన 400 మందికి పైగా హిందువులు
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:52 PM
వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ముర్షీదాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం మైదలైన నిరసనల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. శనివారం కూడా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగాయి.

కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో హింసాకాండ కొనసాగుతుండటంతో హిందువులు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని ఇళ్లు వదిలిపెట్టి పారిపోతున్నారని బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) తెలిపారు. ఇంతవరకూ 400 మందికి పైగా హిందువులు ప్రాణభయంలో ఇళ్లు వీడినట్టు సామాజిక మాధ్యమం "ఎక్స్''లో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న వీడియోలను ఆయన షేర్ చేశారు.
Hanuman Jayanti హనుమన్ జయంతి శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాని నిందితుడితో సహా 9 మంది అరెస్టు
వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ముర్షీదాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం మైదలైన నిరసనల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. శనివారం కూడా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
రాడికల్ శక్తులకు మమత అండ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే రాడికల్ శక్తులు విజృంభిస్తు్న్నాయని సువేందు అధికారి తీవ్ర విమర్శలు గుప్పించారు. "ధులియాన్, ముర్షీదాబాద్‌లోని 400 మందికి పైగా హిందువులు భయంతో ఇళ్లు విడిచిపెట్టారు. తలదాచుకునేందుకు నదిని దాటి మాల్డాలోని పార్ లాల్‌పూర్ హైస్కూలు, డియోనపూర్ సోవాపూర్ జీపీ, వైష్ణవ్‌నగర్‌కు తరలిపోతున్నారు" అని సువేందు తన తాజా ట్వీట్‌లో తెలిపారు. ఫోటోలు, వీడియోలను కూడా జతచేశారు. ఆ వీడియోలో ఒక బాధితుడు తన ఇళ్లను తగులబెట్టారని, పోలీసులు ఎలాంటి సాయానికి ముందుకు రాకపోవడంతో ఇళ్లు విడిచి పారిపోవడం మినహా తనకు గత్యంతరం లేకపోయిందని చెప్పాడు. వెంటనే బీఎస్ఎఫ్ బలగాలను మోహరించి హిందూ బాధితులను వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఈ వార్తలు కూడా చదవండి