ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Akhilesh Yadav: కాంగ్రెస్‌ కంటే ఆప్ బలంగా ఉంది..అందుకే మా మద్దతు

ABN, Publish Date - Jan 15 , 2025 | 03:20 PM

'ఇండియా' కూటమి చెక్కుచెదరకుండా ఉండదని అఖిలేష్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు.

హరిద్వార్: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కంటే 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) బలంగా ఉందని, అందుకే 'ఆప్'కు తాము మద్దతిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తెలిపారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీలకు 'ఇండియా' కూటలు నేతలు మద్దతు ఇవ్వాలన్నారు.

Delhi Assembly Elections: కేజ్రీవాల్ నామినేషన్


''ఆప్, కాంగ్రెస్ ఢిల్లీలో ఒకరిపై మరొకరు పోటీపడుతున్నారు. ఆప్ బలంగా ఉంది. అందుకే వారికి మద్దతుగా ఉండాలని అనుకున్నారు. ఢిల్లీలో బీజీపీని ఓడించాలన్నదే మా లక్ష్యం. కాంగ్రెస్, ఆప్ గోల్ కూడా అదే'' అని అఖిలేష్ చెప్పారు.


'ఇండియా' కూటమి యథాతథం

'ఇండియా' కూటమి చెక్కుచెదరకుండా ఉండదని అఖిలేష్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నందున తమ మద్దతు దానికేనని స్పష్టం చేశారు.


కాగా, 70 మంది అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసే పూర్తి అభ్యర్థులను 'ఆప్' ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ 59 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించింది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. జనవరి 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2025 | 03:20 PM