Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..

ABN, Publish Date - Feb 09 , 2025 | 08:24 PM

ఎంసీడీలో ఎన్నికైన కౌన్సిలర్లు 250 మంది ఉంటారు. అదనంగా, ఏడుగురు ఢిల్లీ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.

Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) చారిత్రక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు మరో కీలక ఎన్నికలపై దృష్టి సారించనుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) మేయర్ ఎన్నికలు (Mayoral Elections) ఈఏడాది ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నాయి. మున్సిపల్ స్థాయిలోనూ బీజేపీ గెలుపు సాధిస్తే 'ట్రిపుల్ ఇంజన్' ప్రభుత్వం బీజేపీ ఏలుబడిలోకి వచ్చినట్టవుతుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఎంసీడీ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని ఆశిస్తోంది.

Prashant Bhushan: ఆప్ ముగింపునకు ఇది ఆరంభం.. కేజ్రీవాల్‌ను ఏకిపారేసిన ప్రశాంత్ భూషణ్


ఎంసీడీలో ఎన్నికైన కౌన్సిలర్లు 250 మంది ఉంటారు. అదనంగా, ఏడుగురు ఢిల్లీ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం బీజేపీకి 120 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 122 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు పోటీచేశారు. అందరూ ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఆప్ నుంచి కూడా ముగ్గురు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.


అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లలో గజేంద్ర డ్రాల్ (ముండ్కా), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), పూనమ్ శర్మ (వజిపూర్), నీలం పెహల్వాన్ (నజఫ్‌గఢ్), ఉమాంగ్ బజాజ్ (రాజేంద్ర నగర్), చందన్ చౌదరి (సంగమ్ విహార్), రవీంద్ర సింగ్ నెగి (పట్పర్‌గంజ్), షిఖా రాయ్ (గ్రేటర్ కైలాష్) ఉన్నారు. బీజేపీ నామినేటెడ్ కౌన్సిలర్ రాజ్‌కుమార్ భాటియా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే, నామినేటెడ్ కౌన్సిలర్లు మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనర్హులు. జోనల్ ఎన్నికల్లో మాత్రం పాల్గొనవచ్చు. బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే మరో విషయం కూడా ఉంది. ఆ పార్టీ మాజీ కౌన్సిలర్ కమల్‌జీత్ షెరావత్ ప్రస్తుతం వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉన్నారు.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎంసీడీలో 12 కౌన్సిల్ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికి ఉపఎన్నికలు జరగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక కౌన్సిలర్‌ను నామిటేడ్ చేస్తారు. ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్ల బలం 112 కాగా, ఆప్‌కు 119 మంది ఉన్నారు. చివరిసారిగా ఐదు నెలల కాలవ్యవధికి ఎంసీడీ మేయర్ ఎలక్షన్లు 2024 నవంబర్‌లో జరిగాయి. కాగా, ఈసారి జరగబోయే మేయర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు ఓటింగ్ అర్హత పొందారు. దీంతో ఏప్రిల్ ఎన్నికల్లో మేయర్ సీటు గెలుచుకునే అవకాశాలు బీజేపీకి బలంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 08:24 PM