Kejriwal Car Attacked: కేజ్రీవాల్‌పై దాడి, భగ్గుమన్న ఆప్.. తిప్పికొట్టిన బీజేపీ

ABN, Publish Date - Jan 18 , 2025 | 05:40 PM

బీజేపీ 'గూండాలే' ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్‌లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.

Kejriwal Car Attacked: కేజ్రీవాల్‌పై దాడి, భగ్గుమన్న ఆప్.. తిప్పికొట్టిన బీజేపీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగింది. శనివారంనాడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ 'గూండాలే' ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్‌లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

AAP Documentary: ఆప్ డాక్యుమెంటరీ 'అన్‌బ్రేకబుల్'కి బ్రేక్


''ఓటమి భయంతో బీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి గూండాలను ఉసిగొల్పింది. ఎన్నికల ప్రచారంలో ఉండగా కేజ్రీవాల్‌ను గాయపరిచి ప్రచారం నుంచి దూరంగా ఉండేలా చేసేందుకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ గూండాలు ఇటుకలు, రాళ్లు ఆయనపై విసిరారు. బీజేపీ పిరికిపంద దాడులకు కేజ్రీవాల్ భయపడే ప్రసక్తేలేదు. ఢిల్లీ ప్రజలు మీకు (బీజేపీ) గట్టి గుణపాఠం చెబుతారు'' అని ఆ పోస్ట్‌లో ఆప్ పేర్కొంది.


పర్వేష్ వర్మ కౌంటర్

'ఆప్' చేసిన ఆరోపణలను పర్వేష్ వర్మ తిప్పికొట్టారు. అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ఆయన తెలిపారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు కారుతో ఆ యువకులను ఢీకొట్టారని, ఆ ఇద్దర్నీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఓటమి తప్పదని గ్రహించిన కేజ్రీవాల్ ప్రజల ప్రాణాలను కూడా లెక్కచేడయం లేదని ఆరోపించారు. గాయపడిన యువకులను పరామర్శించేందుకు ఆసుత్రికి వెళ్తున్నట్టు పర్వేష్ వర్మ ఒక 'ట్వీట్‌' లో తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్‌.. విషయం ఏంటంటే..

Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ

Read Latest National News and Telugu News

Updated Date - Jan 18 , 2025 | 05:40 PM