Atishi Dance: అతిషి డాన్స్ వెనుక కారణం ఇదేనట..

ABN, Publish Date - Feb 09 , 2025 | 09:45 PM

తన గెలుపును పంచుకుంటూ మాజీ ముఖ్యమంత్రి అతిషి డాన్స్ చేసినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Atishi Dance: అతిషి డాన్స్ వెనుక కారణం ఇదేనట..

న్యూఢిల్లీ: ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నియోజకవర్గంలో గెలుపొందారు. తన గెలుపును పంచుకుంటూ ఆమె డాన్స్ చేసినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు అరవింద్ కేజ్రీవాల్ పన్నిన పన్నాగం విఫలమైందని తెలియగానే అతిషి ఆనందంతో డాన్స్ చేసి ఉండొచ్చని చెప్పారు. ఆప్‌ నేతల్లో లుకలుకలకు వారి ఓటమికి అద్దంపడుతుందన్నారు.

Prashant Bhushan: ఆప్ ముగింపునకు ఇది ఆరంభం.. కేజ్రీవాల్‌ను ఏకిపారేసిన ప్రశాంత్ భూషణ్


'అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి రాజకీయాలు చేస్తారో అందరికీ తెలుసు. అన్నాహజారేను అడ్డంపెట్టుకుని పైకి వచ్చారు. ఆయనను వెనక్కి నెట్టేసి సొంతపార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీ వ్యవస్థాపకులను ఒక్కొక్కరనే అణగదొక్కేశారు. అదే తరహాలో కేజ్రీవాల్ టీమ్.. ఆప్ సీనియర్ నేతలు, మంత్రులకు వ్యతిరేకంగా పనిచేసింది. అంతిమంగా కేజ్రీవాల్‌ తాను తీసిన గోతిలో తానే పడ్డారు'' అని అనురాగ్ ఠూకార్ విమర్శించారు.


ఎన్నికల బ్యానర్లు, పోస్టర్లు, ప్రచారంలో అతిషి పేరు లేకుండా చేశారని, ఆమె నిలబడిన అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓడించేందుకు ప్రయత్నించారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయానికి మోదీ ఇచ్చిన గ్యారెంటీలు ఒక ప్రధాన కారణమని, ఇచ్చిన హ్యామీలు తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పారు. కేజ్రీవాల్ అబద్ధాలు, ఆప్ ప్రభుత్వ అవినీతి, తప్పుడు పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని తిప్పికొట్టారని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 09:45 PM