ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Kumbh Mela 2025: కుంభమేళా చేరుకున్న బాహుబలి బాబా.. 800 కిలోమీటర్లకుపైగా సైకిల్ ప్రయాణం

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:49 PM

ఈరోజు ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి బాబా అనే వ్యక్తి పంజాబ్ నుంచి ఏకంగా 800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి కుంభమేళాకు చేరుకున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ఏం చెప్పారనేది ఇక్కడ తెలుసుకుందాం..

Maha Kumbh Mela 2025 Baahubali Baba

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి. ఈ వేడుకలో పాల్గొనేందుకు కొట్లాది మంది భక్తులు దేశంతోపాటు విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. 2025 మహా కుంభమేళా ప్రత్యేకత ఏమిటంటే, ఇది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక మంది వచ్చేస్తున్నారు. ఈ మేళా నేడు మొదలు కాగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ వద్ద లక్షలాది మంది భక్తులు తమ పుణ్యస్నానాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోటి మందికిపైగా భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.


800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి..

ఇదే క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి 800 కిలోమీటర్లకుపైగా సైకిల్‌పై ప్రయాణిస్తూ రామ్ బాహుబలి దాస్ అలియాస్ 'బాహుబలి బాబా(Baahubali Baba)' వచ్చారు. బాహుబలి బాబా పంజాబ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన పండితుడిగా కొనసాగుతున్నారు. ఆ కుంభ్ మేళాలో పాల్గొనడం కోసం ఆయన సైకిల్‌పై ప్రయాణిస్తూ వచ్చారు. పంజాబ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వందల కిలోమీటర్లు ప్రయాణించి చేరుకున్నారు. అందుకే ఆయనను బాహుబలి బాబాగా అని పిలుస్తారని అంటున్నారు. సాధారణ వ్యక్తులకు ఇన్ని కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం చాలా కష్టకరమైన ప్రయాణమని చెప్పవచ్చు.


అనేక కష్టాలను ఎదుర్కొని...

కానీ బాహుబలి బాబా ఆహారం, విశ్రాంతి వంటి వాటి గురించి ఆలోచించకుండా ప్రయాణం చేయడం గ్రేట్ అని పలువురు చెబుతున్నారు. ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మానసిక స్థితి మరింత బలంగా నిశ్చయంగా తయారవుతుందని అంటున్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత తన కోరిక మేరకు ఆధ్యాత్మికత ప్రయాణం చేసి చేరుకోవడం అద్భుతంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇక్కడకు వచ్చిన తరువాత తన జీవితంలో కొత్తదనం, శాంతిని అనూభూతి చెందినట్లు చెప్పారు. మహా కుంభ్ మేళా పుణ్యస్నానంలో పాల్గొనడం, ఆధ్యాత్మికత పొందడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు.


ప్రత్యేక ఏర్పాట్లు..

ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభ్ మేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది భక్తులని ఆకర్షిస్తుంది. ఈ కుంభ్ మేళాకు హజరయ్యే అనేక మంది భక్తులు పలు రకాలుగా తరలివస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 10 వేల మందికిపైగా పోలీసులను ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తుంది. దీంతోపాటు వీఐపీలకు ప్రత్యేక కాటేజీ సౌకర్యాలను సిద్ధం చేసింది. దీంతోపాటు ఇక్కడికి చేరుకునేందుకు 30 వేలకుపైగా రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..


Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 13 , 2025 | 04:54 PM