Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ కేసులో మంబై హైకోర్టు సంచలన తీర్పు
ABN, Publish Date - Apr 07 , 2025 | 06:08 PM
ఈ కేసులో ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇలాంటి చర్యలతో రాష్ట్ర చట్టబద్ధతను, నేర న్యాయ వ్యవస్థపై సామాన్యుల విశ్వాసం దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముంబై: మహారాష్ట్రలోని రాణె జిల్లా బద్లాపూర్ (Badlapur)లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన లైంగిక దాడి కేసు సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్ షిండే ఆ తర్వాత పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. దీనిపై ముంబై హైకోర్టు సోమవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో పాల్గొన్న ఐదుగురు పోలీసులపై రెండ్రోజుల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకు'సిట్' (SIT) ఏర్పాటు చేయాలని క్రైం బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్‌కు సూచించింది. జస్టిస్ రేవతి మోహిత్ దేరే, డాక్టర్ నీల గోఖలేతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
Rahul Gandhi: తరచు బీహార్‌కు రాహుల్... వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు
ఈ కేసులో ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇలాంటి చర్యలతో రాష్ట్ర చట్టబద్ధతను, నేర న్యాయ వ్యవస్థపై సామాన్యుల విశ్వాసం దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ దీనిపై వివరణ ఇస్తూ, ఈ కేసును సీఐడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందన్నారు. విస్తృత దర్యా్ప్తునకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. రెండ్రోజుల్లోగా సిట్‌కు అన్ని పేపర్లను సీఐడీ అందజేయాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News
Updated Date - Apr 07 , 2025 | 06:11 PM