Union Budget 2025: మరికొద్ది రోజుల్లో బడ్జెట్ .. ఎలా ఉండబోతోంది?
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:43 PM
Union Budget 2025: మరికొద్ది రోజుల్లో బడ్జెట్- 2025 ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ముందుకు తీసుకు రానున్నారు. మరి కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతుంది?
న్యూఢిల్లీ, జనవరి 07: మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025- 26 ఆర్థిక బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అలాంటి వేళ.. ఈ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతుంది. భవిష్యత్తులో పన్నులను సులభతరం చేస్తారా? ఉద్యోగస్తులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి నిర్మలమ్మ ఏమైనా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయా? అనే సందేహాలు సర్వత్ర వ్యక్తమవుతోన్నాయి.
అయితే రానున్న బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోనేందుకు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు అవకాశం ఉందని సమాచారం. అందులోభాగంగా పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన మార్పులు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఆలోచనతో ఉన్నట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.
2020 నాటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా పన్ను రేట్లను తగ్గించారు. అందులో చాలా మినహాయింపులు ఇచ్చారు. తద్వారా పన్నుల ప్రక్రియను సులభతరం చేశారు. సంప్రదాయ పన్ను ప్రయోజనాలను వదులు కోవడానికి సిద్ధంగా ఉన్న వారికి స్వల్ప పన్ను రేట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఆరు శ్లాబ్‌లతో కూడిన పన్ను విధానాన్ని తీసుకు వచ్చారు.
ఉదాహరణకు.. ఏడాదికి రూ.15 లక్షలు సంపాదించే వ్యక్తి ప్రస్తుతం రూ.1.95 లక్షల పన్నులు చెల్లిస్తున్నారు. అదే పాత విధానంలో రూ.2.73 లక్షలగా ఉండేది. ఇక పన్ను చెల్లింపుదారులు.. పాత, కొత్త పన్నుల చెల్లించే విధానాల్లో దేనినైనా ఎంచుకోవచ్చనే విధానాన్ని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: భూకంపం: 95 మంది మృతి
అయితే 2021, 2022 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం అమలు చేయలేదు. కానీ 2023 బడ్జెట్‌లో గణనీయమైన మార్పులను తీసుకు వచ్చారు. కొత్త పన్ను విధానం అంటే.. ఐటీఆర్ ఇ -ఫైలింగ్ పోర్టల్‌లో డిఫాల్ట్ ఎంపికగా మారింది. ఇక పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అలాగే వారు తమ రిటర్న్‌లను దాఖలు చేసే ముందు తప్పని సరిగా.. తమ ఎంపికను స్పష్టం చేయాల్సి ఉంది. అలాగే కీలక మార్పులు సైతం చేశాయి.
వార్షిక వేతనం రూ. 7 లక్షలు సంపాదన వరకు పన్నును మినహాయించారు.
అలాగే ఆరు ట్యాక్స్ స్లాబ్‌లను ఐదుకు కుదించారు.
ప్రాధమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు.
జీతం పొందే వ్యక్తులకు రూ. 50 వేల సాండర్డ్ డిడక్షన్‌ను ప్రవేశపెట్టారు.
ఇక 2024 బడ్జెట్‌లో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూర్చారు. దీంతో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000కి పెంచబడింది. అలాగే ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడుల కోసం వారి ప్రాథమిక జీతంలో 14% వరకు తగ్గింపునకు అర్హులుగా నిర్ణయించారు.
మరికొద్ది రోజుల్లో ప్రజల ముందుకు రానున్న ఈ బడ్జెట్‌లో.. మధ్య తరగతి ప్రజలు, పన్ను చెల్లింపుదారుల ఆర్థిక స్థితిగతలను పట్టించుకోని వారికి అనుగుణంగా ఈ పన్ను విధానంలో మార్పులు ఉంటాయనే భావన వ్యక్తమవుతోంది. అవి పన్నుల సంస్కరణల కొనసాగింపునకు ఊతం ఇస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
For National News And Telugu News