Share News

CEC: పకడ్బందీగా పోల్ డాటా సిస్టం... తప్పిదాలకు ఛాన్సే లేదు

ABN , Publish Date - Feb 12 , 2025 | 09:50 PM

'లోక్‌సభ 2024 అట్లాస్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ బుధవారంనాడు మాట్లాడుతూ, పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డాటాలో పాలుపంచుకుంటారని చెప్పారు.

CEC: పకడ్బందీగా పోల్ డాటా సిస్టం... తప్పిదాలకు ఛాన్సే లేదు

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ డేటా తారుమారు అయ్యిందంటూ కొద్దికాలంగా పలు విపక్ష పార్టీలు చేస్తు్న్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) తోసిపుచ్చారు. పోలింగ్ డాటా వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉందని, తప్పిదాలకు ఎలాంటి తావులేదని చెప్పారు. 'లోక్‌సభ 2024 అట్లాస్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ బుధవారంనాడు మాట్లాడుతూ, పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డాటాలో పాలుపంచుకుంటారని చెప్పారు. అందువల్ల పొరపాట్లకు ఆస్కారం ఉండదని వివరించారు.

Mamata Banerjee: కుంభమేళా మృతుల లెక్కలపై మమత సంచలన ఆరోపణ


"ఈసీ నమ్మకమైన వ్యవస్థ. ఎలాంటి పొరపాటుకు ఆస్కారం ఉండదు. ఎవరైనా తప్పు చేసినా సిస్టమ్ దానిని ఒప్పుకోదు'' అని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్ లిస్ట్ ఆరోపణలు, ఓటింగ్ ముగిసేనాటికి ఓటర్ టర్నౌట్‌పై విపక్షాలు ఇటీవల పలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఎన్నికల ఫలితాలుకు సంబంధించి వివిధ కోణాల్లో సమగ్ర సమాచారం అట్లాస్-2024లో పొందుపరిచారు. 2024 పార్లమెంటరీ ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరుగగా, 44 రోజుల్లో పోలింగ్ పూర్తయింది. ఇందుకోసం10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2025 | 09:50 PM