AAP Health Scam: ఆప్ హెల్త్ స్కామ్, రూ.382 కోట్ల అవినీతి: కాంగ్రెస్
ABN , Publish Date - Jan 22 , 2025 | 06:24 PM
అరవింద్ కేజ్రీవాల్‌పై 14 కాగ్ నివేదికలు తీవ్ర ఆరోపణలు చేశాయనీ, ఇందులో రూ.382 కోట్ల హెల్త్ రిలేటెడ్ స్కామ్ జరిగినట్టు పేర్కొన్న నివేదక కూడా ఉందని అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో రూ.382 కోట్ల స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ (Ajay Maken) బుధవారంనాడు ఆరోపించారు. కాగ్ 14 నివేదికల్లో ఒక నివేదిక ఆరోగ్య శాఖలో స్కామ్‌కు సంబంధించినదని అన్నారు.
CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
"అవినీతిపై పోరాటం చేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత అవినీతిలో కూరుకుపోయారు. అప్పట్లో కాగ్ నివేదక ఆధారం చేసుకుని కాంగ్రెస్‌పై ఆవినీతి ఆరోపణలు చేశారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్‌పై 14 కాగ్ నివేదికలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇందులో రూ.382 కోట్ల హెల్త్ రిలేటెడ్ స్కామ్ జరిగినట్టు కాగ్ పేర్కొన్న నివేదక కూడా ఉంది'' అని మాకెన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మూడు ఆసుపత్రులకు టెంటర్‌కు మించి రూ.382.52 కోట్లు వెచ్చించినట్టు కాగ్ నివేదిక చెబుతోందని, తమ అక్రమాలు ఎక్కడ బయడతాయోననే కారణంతోనే ఆ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టుకుండా నిలిపివేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో ఆసుపత్రుల నిర్మాణంలో జరిగిన జాప్యంపై మాకెన్ మాట్లాడుతూ, పదేళ్లలో మూడు ఆసుపత్రులే సిద్ధం చేశారని, అవి కూడా కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినవేనని అన్నారు. ఇందిరాగాంధీ ఆసుపత్రి ఏర్పాటులో ఐదేళ్లు, బురారి ఆసుపత్రిలో ఏర్పాటులో ఆరేళ్లు, మౌలానా ఆజాద్ డెంటల్ ఆసుపత్రి విషయంలో మూడేళ్లు జాప్యం జరిగిందన్నారు. దీంతో ఇందిరాగాంధీ ఆసుపత్రి అదనంగా రూ.314 కోట్లు, బురారి ఆసుపత్రికి అదనంగా రూ.41 కోట్లు, మౌలానా ఆజాద్ డెంటల్ కాలేజీకి రూ.26 కోట్లు అదనంగా ఖర్చు చేశారన్నారు. 2016-17 నుంచి 20-21-22 వరకూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ రూ.2,625 కోట్లు మంజూరైతే ఆ డబ్బు ఖర్చు చేయకపోవడం వల్ల నిధులు లాప్స్ అయ్యాయని, కోవిడ్ మహమ్మార సమయంలో కేంద్రం మంజూరుచేసిన నిధుల్లో 56 శాతం నిధులను ప్రజారోగ్యం, సంక్షేమానికి వినియోగించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, ఇతర సౌకర్యాలను కూడా కాగ్ తనిఖీ చేసిందని, సిబ్బంది కొరత ఉన్నట్టు గుర్తించిందని చెప్పారు. రాజీవీ గాంధీ, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత 50 నుంచి 74 శాతం, నర్సుల కొరత 73 నుంచి 96 శాతం ఉందని అన్నారు.
కాగా, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి..
Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో
State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు
influential Indians : సత్యం.. సుందరం!
Read More National News and Latest Telugu News