Delhi Assembly Elections: ఈవీఎం అవకతవకలు, రిగ్గింగ్‌కు తావులేదు: ఈసీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:11 PM
ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
న్యూఢిల్లీ: నిర్దిష్ట గ్రూపులను టార్గెట్ చేసుకుని ఓటర్ల జాబితాలో వారి పేర్లు తొలగించడం, కొందరి పేర్లు చేర్చడం జరిగిందని కొందరు (రాజకీయ పార్టీలు) చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) తోసిపుచ్చారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎంలలో వైరస్, బగ్ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతోందన్నారు
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ
ఎన్నికల జాబితాలో అవకతవకలపై ఇప్పటికీ కథనాలు వస్తున్నాయని, ఈ విషయంలో 70 స్టెప్స్ ఉంటాయని, ఎన్నికల జాబితా, ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లు, ఫార్స్ 17 (సీ), కౌంటింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. పార్టీలు, అభ్యర్థులు అక్కడ తమతో ఉంటారని చెప్పారు. ''ఎన్నికల జాబితాలు రూపొందించేటప్పుడు రెగ్యులర్ సమావేశాలు ఉంటాయి. ఫామ్-6 లేకుండా సాధ్యం కాదు. ప్రతి దశలోనూ బీఎల్ఏను నియమించుకునే హక్కు ఉంటుంది. అభ్యంతరాలు తలెత్తితే ప్రతి పార్టీతో షేర్ చేసుకుని దానిని వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫామ్7 సమర్పించేంత వరకూ పేర్లు తెలగించడం సాధ్యేం కాదు'' అని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
రాజీవ్ కుమార్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, ఐదోసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. 25.89 లక్షల మంది యువ ఓటర్లు (20-29) ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలో13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!
Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం
Read Latest National News and Telugu News