Share News

Delhi: ఎల్జీ అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:50 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త సీఎంగా ఎవరిని అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే అంశంపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి.

Delhi: ఎల్జీ అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సేనా (Vinay Kumar Saxena)ను కలుసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ (Virendra Sachdeva) లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆదివారంనాడు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, సిటీకి చెందిన లోక్‌సభ ఎంపీలు సాధ్యమైనంత తర్వగా మిమల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారని, వీలుచూసుకుని అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో వినయ్ కుమార్ సక్సేనాను సచ్‌దేవ కోరారు.

Delhi: సీఎం రేసులో ఆ ముగ్గురు... మహిళలు, ఎంపీల పేర్లు సైతం పరిశీలనలో


అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించి 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఆధికార పగ్గాలు చేపట్టనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు మెజారిటీకి అవసరమైన 36 స్థానాలు సాధించడంలో ఆప్ విఫలమైంది. కేవలం 22 సీట్లతో చతికిలపడింది. బీజేపీ 48 సీట్లతో పూర్తి ఆధిక్యతను చాటుకుంది.


పీఎం పర్యటన తర్వాతే..

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త సీఎంగా ఎవరిని అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే అంశంపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేష్ వర్మ గెలుపొందారు.


బీజేపీకి పెరిగిన ఓట్ షేర్

కాగా, గత పదేళ్లలో ఢిల్లీలో బీజేపీ ఓటింగ్ షేర్ 13 శాతం పెరిగింది. ఇదే సమయానికి ఆప్ ఓటింగ్ షేర్ 10 శాతం తగ్గింది. హోరాహోరీగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఆప్ మధ్య కేవలం 2 శాతమే ఓట్ షేర్ వ్యత్యాసం ఉంది. బీజేపీ ఓటింగ్ షేర్ 45.56గా ఉండగా, ఆప్ ఓటింగ్ షేర్ 43.57 శాతంగా ఉంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోనప్పటికీ ఓటింగ్ షేర్ 6.34గా ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 2.1 శాతం ఓటింగ్ షేర్‌ కంటే ఈసారి మెరుగుపడటం విశేషం.


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:50 PM