Manish Gupta: ఢిల్లీ సీఎం భర్తపై ఆరోపణలు..బీజేపీ రియాక్షన్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:06 PM
ఢిల్లీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈసారి వివాదం కేంద్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా విషయంలో వచ్చాయి. ఆయనపై సంచలన ఆరోపణలు చేసినది మరెవరో కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ నాయకురాలు అతిషి. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు ప్రస్తుతం మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుపా(Manish Gupta)పై వచ్చిన ఆరోపణలతో కొత్త వివాదం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా పై ఆరోపణలు చేసిన వ్యక్తి ప్రముఖ ప్రతిపక్ష నేత అతిషి కావడం విశేషం. శనివారం రోజున, అతిషి సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేశారు. అందులో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD), ఢిల్లీ జల్ బోర్డు (DJB), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD), ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (DUSIB) అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న వ్యక్తి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా అని అతిషి పేర్కొన్నారు.
ప్రభుత్వ పనులన్నీ
ఈ ఫోటోలో మనీష్ గుప్తా ప్రభుత్వ అధికారులు సమావేశంలో పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అతిషి తన పోస్టులో ఇలా పేర్కొన్నారు. ఒక మహిళ గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి తర్వాత, ప్రభుత్వ పనులన్నీ ఆమె భర్తే చూసుకుంటారని ఇది వరకు చూశాం. కానీ ఇప్పుడు ఢిల్లీకి ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వ పనులన్నీ ఆమె భర్తే చూసుకోవడం ఇదే మొదటిసారి అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలకు ఢిల్లీ బీజేపీ స్పందించింది. బీజేపీ నేత వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ అతిషి స్వయంగా ఒక మహిళ అయినప్పటికీ, మహిళా నాయకురాలిని అవమానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతతో రేఖ గుప్తా, DUSU స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి పదవి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి వరకు తన సొంత కృషితో ఎదిగారని గుర్తు చేశారు. అయినా కూడా ఆమె భర్త..ఆమెకు మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం కాదన్నారు.
రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఎవరు?
రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. రేఖ గుప్తా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన మనీష్ గుప్తా సంస్థ పేరు నికుంజ్ ఎంటర్‌ప్రైజెస్. మనీష్ గుప్తా కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏజెన్సీ అసోసియేట్ కూడా. ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేఖ గుప్తా తన విజయానికి తన భర్తే కారణమని చెప్పుకొచ్చారు.
తన రాజకీయ ప్రయాణంలో తన భర్త తనకు మద్దతు ఇచ్చాడని అన్నారు. తన విజయంలో భర్త పాత్ర గురించి అడిగినప్పుడు, ఆమె, “ఖచ్చితంగా, అవును” అని చెప్పింది. ఆయన ఆమె కోసం కోసం ఎంతో చేశాడని వెల్లడించింది. అయితే భవిష్యత్తులో ఈ వివాదం మరింత పెరుగుతుందా లేదా అనేది చూడాలి మరి. ఈ విషయం పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్‌ను బీట్ చేసిన వెండి
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu News