Share News

Terror Funding Case: ఎంపీకి బెయిల్ నిరాకరణ

ABN , Publish Date - Mar 21 , 2025 | 07:30 PM

ఏప్రిల్ 4వ తేదీ వరకూ లోక్‌సభ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ కానీ, తాత్కాలిక బెయిల్ కానీ మంజూరు చేయాలని విచారణ కోర్టును ఇటీవల రషీద్ కోరారు. అయితే అతని అభ్యర్థను కోర్టు మార్చి 10న కొట్టివేసింది.

Terror Funding Case: ఎంపీకి బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు (Terror Funding case)లో జైలులో ఉన్న జమ్మూకశ్మీర్ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ (Engineer Rashid)కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు నిరాకరించింది. ఆయన బెయిలు అభ్యర్థనను అడిషనల్ సెషన్స్ జడ్జి చందెర్ జిత్ సింగ్ కొట్టివేశారు. బారాముల్లా లోక్‌సభ ఎంపీగా ఉన్న రషీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఐఏ 2017లో అరెస్టు చేయగా, 2019 నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.

Karnataka: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం


ఏప్రిల్ 4వ తేదీ వరకూ లోక్‌సభ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ కానీ, తాత్కాలిక బెయిల్ కానీ మంజూరు చేయాలని విచారణ కోర్టును ఇటీవల రషీద్ కోరారు. అయితే అతని అభ్యర్థను కోర్టు మార్చి 10న కొట్టివేసింది. దీనిని ఆయన మార్చి 17న సవాలు చేశారు. అయితే చట్టపరంగా కస్టడీలో ఉన్న ఆయన శిక్ష నుంచి తప్పించుకునేందుకు తన రాజకీయ హోదాను ఉపయోగించుకోవడానికి కోర్టు అనుమతించరాదని ఎన్ఐఏ కోరింది.


2024 ఎన్నికల్లో గెలిచిన రషీద్

రషీద్ ఇంజనీర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసి ఒమర్ అబ్దుల్లాపై గెలుపొందారు. ఈ కేసులో రషీద్ బెయిలు అభ్యర్థనపై త్వరితగతిని నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 24న సెషన్ జడ్జిని ఆదేశించారు. కశ్మీర్‌ లోయలో వేర్పాటువాద, తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా కశ్మీర్ వ్యాపారి జహూర్ వాటాలిని ఎన్ఐఏని అరెస్టు చేసి విచారణ జరిపినప్పుడు రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైయద్ సలావుద్దీన్‌లపై కూడా ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది.


ఇవి కూడా చదవండి

MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే

Read Latest National News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 07:33 PM