Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:06 PM
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ స్పందించారు. స్థానిక పరిస్థితులతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారని వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖరారైపోయింది. ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలింది. ఆప్ పార్టీ భారీ ఓటమి చవి చూడగా కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ స్పందించారు. దేశ రాజధాని ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో విసిగిపోయి మార్పు కోసం ఓటేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సమావేశాల సందర్భంగానే స్పష్టంగా తేలిపోయిందని వ్యాఖ్యానించారు (Priyanka Gandhi).
BJP Victory: ఢిల్లీ విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ వ్యూహం ఇదీ!
‘‘స్థానిక పరిస్థితులతో ప్రజలు విసిగిపోయారు. మార్పును కోరుకున్నారు. మార్పు కోసమే వారు ఓటేశారని అనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ నా శుభాకాంక్షలు. మిగిలిన వారు మరింతగా శ్రమించాలని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలు సమస్యలపై స్పందించాలి’’ అని ఆమె అన్నారు. కేరళ పర్యటనలో ఉన్న ప్రియాంకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కమిషన్ తాజా వివరాల ప్రకారం, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో కాషాయం పార్టీ ప్రస్తుతం 45 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ 21 స్థానాల్లో తొలి స్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్‌కు మూడోసారి కూడా రిక్తహస్తాలు మిగిలే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి