Amit Shah: ట్రాఫిక్ జామ్‌లు, చొరబాటుదార్లపై కొరడా.. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అమిత్‌షా సమీక్ష
ABN , Publish Date - Feb 28 , 2025 | 07:25 PM
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై శుక్రవారంనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్‌షా సమీక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోం మంత్రి ఆశిష్ సూద్, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ట్రాఫిక్ జామ్‌లు, చొరబాటుదార్ల సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆదేశించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై శుక్రవారంనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన సమీక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోం మంత్రి ఆశిష్ సూద్, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఐబీ చీఫ్, ఎంహెచ్ఏ సీనియర్ అధికారులు సైతం పాల్గొన్నారు. దేశంలోకి బంగ్లాదేశ్, రోహింగ్లా చొరబాటుదారులకు సహకరించే నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్‌షా ఆదేశించారు.
BJP New Chief: మార్చి 15 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఎవరంటే?
సమావేశంలో కీలక నిర్ణయాలు
-ఢిల్లీలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంచనాలకు అనుగుణంగా సత్వర అభివృద్ధి, సురక్షిత ఢిల్లీ దిశగా రెట్టించిన వేగంగా పనిచేయాలని అమిత్‌షా ఆదేశించారు.
-దేశంలో బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుల అక్రమ ప్రవేశానికి డాక్యుమెంట్లు సృష్టించి, ఇక్కడే ఉండేలా సహకరిస్తున్న నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపాలి.
-దేశభద్రతకు అక్రమ చొరబాటులు విఘాతం. దీనిపై కఠినంగా వ్యవహరించి, అక్రమ చొరబాటుదార్లను గుర్తించి, వారిని వెనక్కి పంపాలి.
-ఢిల్లీలోని అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి కఠినంగా వ్యవహరించేందుకు ఢిల్లీ పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
-నార్కోటిక్ కేసులను సీరియస్‌గా తీసుకుని నెట్‌వర్క్ మొత్తాన్ని ధ్వంసం చేయాలి.
-ఢిల్లీలో నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో ఢిల్లీ పోలీసుల అనుమతి అవసరం లేదు.
-2020 ఢిల్లీ అలర్ల కేసులను సత్వర పరిష్కారానికి స్పెషల్ ప్రాసిక్యూటర్లను ఢిల్లీ ప్రభుత్వం నియమించుకోవచ్చు.
- అదనపు పోస్టుల భర్తీ ప్రక్రియను ఢిల్లీ పోలీసులు సత్వరం ప్రారంభించవచ్చు.
-డీసీపీ స్థాయి అధికారులు పోలీసులు స్టేషన్లకు వెళ్లి, పబ్లిక్ హియరింగ్ క్యాంపులు నిర్వహించడం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కరించాలి.
-మహిళలు, పిల్లల భద్రత కోసం జేజే క్లస్టర్లలో కొత్త సెక్యూరిటీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.
-ఢిల్లీ పోలీసులు నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. ఢిల్లీ పోలీస్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ కలిసి సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనాలి. ప్రజలకు ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఉపశమనం కలిగించాలి.
-నీళ్లు ఎక్కడైతే నిలిచిపోతున్నాయో గుర్తించేందుకు "మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్''ను ఢిల్లీ ప్రభుత్వం సిద్ధం చేయాలి.
ఇవి కూడా చదవండి
Boat Fire Accident : మంటల్లో చిక్కుకున్న ఫిషింగ్ బోటు.. 20 మంది మత్స్యకారులు..
Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.